News April 24, 2024

డీజీపీని తప్పించాలని టీడీపీ ఫిర్యాదు

image

AP: DGP రాజేంద్రనాథ్‌రెడ్డిని తప్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాకు TDP ఫిర్యాదు చేసింది. ‘సీనియర్లను పక్కనపెట్టి ఆయనకు ఇన్‌ఛార్జ్ DGP బాధ్యతలు అప్పగించారు. DGPని వెంటనే బదిలీ చేయాలి. జగన్ ప్రచార బస్సు డోర్ వద్ద ఉండాలని SPలకు చెప్పడం ఏంటి? కడప, పులివెందులలో ఎన్నికలు సజావుగా జరగాలి. ఈ డీజీపీ ఎన్నికలు సజావుగా నిర్వహిస్తారా?’ అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.

Similar News

News November 20, 2024

నేడు వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయన పలు కీలక విషయాలపై మాట్లాడతారని తెలుస్తోంది. పోలవరం, రుషికొండ వంటి పలు అంశాలపై ఆయన మీడియాకు వివరించనున్నట్లు సమాచారం. అలాగే కూటమి సర్కార్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News November 20, 2024

కోహ్లీ ఆట చూడాలని ఉంది: అక్తర్

image

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటను చూసేందుకు యావత్ పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తెలిపారు. కోహ్లీ తొలిసారి పాక్ గడ్డపై అడుగుపెట్టాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘విరాట్ పాక్ గడ్డపై సెంచరీ చేస్తే ఎలా ఉంటుందో ఊహించలేం. ఇక్కడ ఆడితే ఆయన క్రికెట్ జీవితం పరిపూర్ణం అవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు చివరి క్షణంలోనైనా భారత్ ఇక్కడికి వస్తుందేమో చూడాలి’ అంటూ పేర్కొన్నారు.

News November 20, 2024

సెండాఫ్ సమయంలో వందేభారత్ ఎక్కొద్దు!

image

కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌లో కొడుకును రైలు ఎక్కించేందుకు వచ్చిన ఓ తండ్రికి చేదు అనుభవం ఎదురైంది. వందేభారత్ రైలెక్కి కొడుకు సీటు వద్ద లగేజీ పెట్టి దిగుతుండగా డోర్లు క్లోజ్ అయ్యాయి. దీంతో అతను కొడుకుతో కలిసి న్యూఢిల్లీ వరకూ వెళ్లాల్సి వచ్చింది. ఇలా టికెట్ లేకుండా ప్రయాణించినందుకు ఆయనకు టీసీ రూ.2870 జరిమానా విధించారు. ఎవరైనా తమవారికి సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చినప్పుడు వందేభారత్‌లోకి ఎక్కకపోవడమే బెటర్.