News April 24, 2024

డీజీపీని తప్పించాలని టీడీపీ ఫిర్యాదు

image

AP: DGP రాజేంద్రనాథ్‌రెడ్డిని తప్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాకు TDP ఫిర్యాదు చేసింది. ‘సీనియర్లను పక్కనపెట్టి ఆయనకు ఇన్‌ఛార్జ్ DGP బాధ్యతలు అప్పగించారు. DGPని వెంటనే బదిలీ చేయాలి. జగన్ ప్రచార బస్సు డోర్ వద్ద ఉండాలని SPలకు చెప్పడం ఏంటి? కడప, పులివెందులలో ఎన్నికలు సజావుగా జరగాలి. ఈ డీజీపీ ఎన్నికలు సజావుగా నిర్వహిస్తారా?’ అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.

Similar News

News January 20, 2025

మెదక్: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి

image

విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లదేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. అందోల్ నియోజకవర్గాన్ని విమెన్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే నర్సింగ్ కాలేజీ కూడా ప్రారంభించామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారని, వారందరి బాగోగులు చూసుకోవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు.

News January 20, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 20, 2025

శుభ ముహూర్తం (20-01-2025)

image

✒ తిథి: బహుళ షష్ఠి ఉ.8.58 వరకు
✒ నక్షత్రం: హస్త రా.7.50 వరకు
✒ శుభ సమయం: సా.6.56-7.20 వరకు
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-12.00 వరకు
✒ దుర్ముహూర్తం: 1.మ.12.24-1.12 వరకు
2.మ.2.46-3.34 వరకు
✒ వర్జ్యం: తె.4.42-6.28 వరకు
✒ అమృత ఘడియలు: మ.1.16-3.02 వరకు