News April 4, 2024
విద్యార్థినికి ముద్దు.. టీచర్‌కు 5ఏళ్ల జైలు
గుజరాత్‌లోని సూరత్‌లో ఓం ప్రకాశ్ యాదవ్ అనే టీచర్ 13ఏళ్ల విద్యార్థినికి ముద్దు పెట్టినందుకు జైలు పాలయ్యాడు. 2018లో బాలికను స్టాఫ్ రూమ్‌లోకి పిలిచి.. తలుపులు మూసి ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాలిక ఫిర్యాదుతో ఆ టీచర్‌పై పోక్సో కేసు నమోదైంది. బడిలో టీచర్లు ఇంట్లో తల్లిదండ్రులతో సమానమని చెప్పిన కోర్టు.. ఆ టీచర్‌కు రూ.9వేల జరిమానాతో పాటు 5ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Similar News
News December 8, 2024
నాగార్జునసాగర్ నుంచి APకి 12TMC నీరు
నాగార్జునసాగర్ నుంచి APకి 12TMCల నీరు విడుదల కానుంది. 15.86TMCల నీటిని విడుదల చేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB)ను AP ప్రభుత్వం కోరింది. కాగా, ఇప్పటికే వాడుకున్న జలాలను పరిగణనలోకి తీసుకొని 12TMCల నీటిని జనవరి 31 వరకు విడుదల చేసేందుకు KRMB అనుమతి ఇచ్చింది. గత నెల 25తేదీ నాటికి 9.55TMCల నీటిని వాడుకున్నామని, 32.25TMC జలాలను వాడుకునేందుకు అర్హత ఉందని AP ప్రభుత్వం లేఖలో తెలిపింది.
News December 8, 2024
ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం కొత్త రూల్స్
అత్యవసర పరిస్థితుల్లో ఐజీ లేదా ఆ పైస్థాయి పోలీస్ ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశించవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ట్యాపింగ్‌కు ఆదేశించిన అధికారి సదరు ఆదేశాలు నిజమైనవేనని 7 పనిదినాల్లో నిర్ధారించకపోతే ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటాను దేనికీ వాడొద్దని, 2 రోజుల్లో ఆ డేటాను ధ్వంసం చేయాలని తెలిపింది. ట్యాపింగ్ ఆదేశాలను సంబంధిత శాఖల కార్యదర్శుల కమిటీ సమీక్షించాల్సి ఉంటుందని పేర్కొంది.
News December 8, 2024
12న ఏపీలో భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది 11న శ్రీలంక- తమిళనాడు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో 12న ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నేడు అనకాపల్లి, విశాఖ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.