News August 15, 2024
TEAM INDIA: ఏడాదిలో 3 వన్డేలేనా..!
2024లో టీమ్ ఇండియా 3 వన్డేలు మాత్రమే ఆడింది. తర్వాతి పర్యటనల్లో కూడా వన్డేలు లేవు. దీంతో భారత్ అత్యంత తక్కువ వన్డేలు ఆడటంతో బీసీసీఐపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఒకప్పుడు ఒక సిరీస్‌లోనే 7 వన్డేలు ఆడేవారని.. అలాంటిది ఏడాది మొత్తం మీద 3 మ్యాచులు ఆడటం ఏంటని మండిపడుతున్నారు. వన్డే క్రికెట్‌ను చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ కోసం ఈ పార్మాట్‌ను బలి చేశారని ఫైర్ అవుతున్నారు.
Similar News
News September 15, 2024
ముగ్గురు ఐపీఎస్‌లకు ప్రభుత్వం షాక్
AP: ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, మరో ఐపీఎస్ విశాల్ గున్నిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పేరుతో ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధించారని వీరిపై ఆరోపణలున్నాయి.
News September 15, 2024
ఇవాళే ఎందుకు రాజీనామా చేయకూడదు?: బీజేపీ
ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ 48 గంటల్లో కాకుండా ఇవాళే ఎందుకు రాజీనామా చేయకూడదని బీజేపీ ప్రశ్నించింది. ఆప్ చీఫ్ ఎందుకీ డ్రామా క్రియేట్ చేస్తున్నారని దుయ్యబట్టింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనే ఆ పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొంది. రోడ్లపై కేజ్రీవాల్ ప్రచారం చేసినా ప్రజలు ఆయనను సరైన స్థానంలో ఉంచారని విమర్శించింది. మరోవైపు సీఎం రాజీనామా నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది.
News September 15, 2024
చంద్రబాబు గారూ.. ఇకనైనా కళ్లు తెరవండి: జగన్
AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే ఆలోచనను ప్రభుత్వం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘పులివెందుల కాలేజీకి NMC 50 సీట్లిస్తే వద్దని లేఖ రాయడమేంటి? పక్క రాష్ట్రాలు మెడికల్ సీట్ల కోసం ప్రదక్షిణాలు చేస్తుంటే APకి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏంటి? కరోనా సమయంలో ప్రజల్ని కాపాడింది ప్రజారోగ్య రంగమే. ఇకనైనా కళ్లు తెరవండి చంద్రబాబుగారు. పేదలకు ఉచిత వైద్య విద్య, వైద్యం అందించండి’ అని ఫైర్ అయ్యారు.