News August 6, 2024

CM రేవంత్‌తో టీమ్ ఇండియా అంధ క్రికెటర్లు

image

TG: అమెరికా పర్యటనలో ఉన్న CM రేవంత్ రెడ్డిని టీమ్ ఇండియా అంధ క్రికెటర్లు కలిశారు. సీఎంను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం తరఫున క్రికెటర్లకు సాయం చేస్తామని రేవంత్ ప్రకటించారు. కాగా అంధుల క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు ఆటగాళ్లు US వెళ్లారు. ఆ దేశం తరఫున కూడా అంధుల క్రికెట్ జట్టు ఏర్పాటు చేసేందుకు వీరు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా USలోని 8 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.

Similar News

News April 17, 2026

పండ్లు తింటున్నారా? FSSAI వార్నింగ్!

image

మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్లను కృత్రిమంగా పండించేందుకు ‘మసాలా’ (కాల్షియం కార్బైడ్) వాడకంపై FSSAI కఠిన చర్యలు చేపట్టింది. ఈ రసాయనం వల్ల చర్మ వ్యాధులు, గొంతు సమస్యలు, వాంతులు వచ్చే ప్రమాదం ఉండటంతో తనిఖీలు చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇథిలీన్ ద్రావణంలో పండ్లను ముంచడం కూడా నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

News April 17, 2026

అనుమతి లేకుండా అల్లు అర్జున్ పేరు, ఫొటో వాడొద్దు: ఢిల్లీ హైకోర్టు

image

అల్లు అర్జున్ వ్యక్తిత్వ హక్కులను (Personality Rights) పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు <<19671551>>ఉత్తర్వులు<<>> జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా పేరు, వాయిస్, ఫొటోలు, సంతకాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని స్పష్టం చేసింది. డీప్‌ఫేక్, AI టెక్నాలజీతో తన వాయిస్‌ని క్లోనింగ్ చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేయడం వంటివి తన బ్రాండ్ విలువను, ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆయన కోర్టును ఆశ్రయించగా ఇలా స్పందించింది.

News April 17, 2026

LRS దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలి: మంత్రి

image

AP: అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు దాఖలైన LRS దరఖాస్తులలో అర్హమైన వాటిని వెంటనే ఆమోదించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్‌పై మున్సిపల్ ముఖ్యకార్యదర్శి సురేశ్‌, ఇతర అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న వాటిని క్లియర్ చేయాలని సూచించారు. ఇప్పటికే పలుమార్లు పొడిగించిన దరఖాస్తు గడువు ఈనెల 23తో ముగియనుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.