News January 24, 2025
పులి దాడిలో టీమ్ ఇండియా క్రికెటర్ బంధువు మృతి

కేరళలోని వయనాడ్‌లో పెద్ద పులి దాడిలో టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ మిన్ను మణి బంధువు రాధ (45) ప్రాణాలు కోల్పోయారు. కాఫీ తోటలో పని చేస్తుండగా ఆమెపై పులి ఒక్కసారిగా దాడి చేసింది. మృతదేహంలో కొంత భాగం తినేసి వెళ్లిపోయింది. ఈ ఘటనపై కేరళలో ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. క్రూరమృగాల దాడిలో పదేళ్లలో 8 మంది మృతి చెందారని, ఇంకెంతమంది బలవ్వాలని ప్రశ్నిస్తున్నారు.
Similar News
News February 18, 2025
ప్రజాస్వామ్యంపై జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది: లోకేశ్

AP: అధికారం ఉన్నప్పుడు చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం కోట్లాది మంది కళ్లారా చూశారని చెప్పారు. పచ్చి అబద్ధాలను కాన్ఫిడెంట్‌గా చెప్పడంలో జగన్ PhD చేసినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు జగన్ బ్రాండ్ అని ఫైరయ్యారు.
News February 18, 2025
పరీక్ష లేకుండా 21,413 ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. APలో 1,215, TGలో 519 ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి పరీక్ష లేకుండా టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు చేపడతారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ శాలరీ నెలకు రూ.12,000-రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జీతం రూ.10,000-రూ.24,470 వరకు ఉంటుంది. చివరి తేదీ: మార్చి 3. indiapostgdsonline.gov.in
News February 18, 2025
ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించం: మంత్రి డీబీవీ స్వామి

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించబోమని, అవసరం అయితే కొత్త నియామకాలు చేపడతామని మంత్రి డీబీవీ స్వామి స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియపై పలు సమీక్షలు నిర్వహించి జనాభా ప్రాతిపదికన A, B, C క్యాటగిరీలుగా వారిని నియమించాలని నిర్ణయించామన్నారు. పదోన్నతులు, మిగిలిపోయిన ప్రొబేషన్ డిక్లరేషన్, జీతం స్కేలుపై ఉన్నతాధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.