News March 3, 2025
టీమ్ ఇండియాకు మరోసారి ‘హెడ్‘ఏక్?

ఆస్ట్రేలియా విధ్వంసకర ప్లేయర్ ట్రావిస్ హెడ్ తన ప్రత్యర్థి భారత్ అయితే చాలు చెలరేగిపోతారు. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ టీమ్ ఇండియాపై తన రికార్డును కొనసాగించారు. కీలక సమయాల్లో సెంచరీలతో విజృంభించి భారత విజయాలను ఆయన అడ్డుకుంటున్నారు. ఈ నెల 4న ఆసీస్‌తో భారత్ సెమీస్ ఆడాల్సి ఉంది. ఇందులోనూ హెడ్ అడ్డుగోడలా నిలుస్తారేమోనని భారత్ ప్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 25, 2025
అల్యూమినియం పాత్రలు వాడుతున్నారా?

అల్యూమినియం పాత్రలను వాడటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘అల్యూమినియం ఆహారం, నీటిలో సహజంగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల న్యూరో టాక్సిక్ ప్రభావాలను కలిగించవచ్చు. కొన్నిసార్లు ఇది క్యాన్సర్‌కు దారితీస్తుంది. అధిక వేడి వద్ద ఇది ఆహారంలో కలవొచ్చు. ఈ అధిక అల్యూమినియం ఎముకలు, లివర్, కిడ్నీలను ప్రభావితం చేయొచ్చు. అందుకే స్టీల్, కాస్ట్ ఐరన్ పాత్రలను వాడితే బెటర్’ అని తెలిపారు.
News March 25, 2025
Stock Markets: ఎగిసి ‘పడ్డ’ నిఫ్టీ, సెన్సెక్స్

ఉదయం భారీగా లాభపడ్డ బెంచ్‌మార్క్ సూచీలు చివరికి ఫ్లాటుగా ముగిశాయి. సెన్సెక్స్ 78,017 (32), నిఫ్టీ 23,668 (10) వద్ద స్థిరపడ్డాయి. సూచీలు రెసిస్టెన్సీ వద్దకు చేరడం, ట్రంప్ టారిఫ్స్ ప్రకటనే ఇందుకు కారణాలు. ఐటీ షేర్లు ఎగిశాయి. వినియోగం, PSU బ్యాంకు, మీడియా, రియాల్టి, మెటల్, ఎనర్జీ, చమురు, PSE, ఫార్మా, ఆటో, కమోడిటీస్ షేర్లు ఎరుపెక్కాయి. అల్ట్రాటెక్, ట్రెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, గ్రాసిమ్ టాప్ గెయినర్స్.
News March 25, 2025
ముస్లిములకు BJP రంజాన్ గిఫ్ట్: 32లక్షల కిట్స్ రెడీ

రంజాన్ సందర్భంగా BJP మైనారిటీ మోర్చా ‘సౌగాత్ ఈ మోదీ’ క్యాంపెయిన్ ఆరంభిస్తోంది. దేశవ్యాప్తంగా 32లక్షల పేద ముస్లిములకు పండగ కిట్లను అందించనుంది. అర్హులైన వారికి ఇవి చేరేందుకు 32వేల మోర్చా కార్యకర్తలు 32వేల మసీదులతో సమన్వయం అవుతారు. BJP ప్రెసిడెంట్ JP నడ్డా రేపు ఢిల్లీలో కిట్ల పంపిణీని ఆరంభిస్తారు. వీటిలో పురుషులు, స్త్రీలకు వస్త్రాలు, సేమియా, ఖర్జూర, ఎండు ఫలాలు, చక్కెర ఇతర వస్తువులు ఉంటాయి.