News July 20, 2024

ఎల్లుండి శ్రీలంకకు టీమ్ ఇండియా?

image

వన్డే, టీ20 సిరీస్ కోసం ఈ నెల 22న టీమ్ ఇండియా శ్రీలంక వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు గౌతమ్ గంభీర్‌కు అధికారికంగా కోచ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. కాగా గంభీర్ ప్రతిపాదించిన అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డెస్కాటేను భారత కోచింగ్ సిబ్బందిలోకి BCCI తీసుకోనున్నట్లు టాక్. ఫీల్డింగ్ కోచ్‌గా ప్రతిపాదించిన జాంటీ రోడ్స్‌ను మాత్రం ఎంపిక చేయలేదని, టి.దిలీప్‌నే కొనసాగించనుందని వార్తలు వస్తున్నాయి.

Similar News

News December 10, 2024

టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్: ఛైర్మన్

image

AP: భక్తుల పట్ల టీటీడీ ఉద్యోగులు బాధ్యత, అంకితభావంతో పనిచేసేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ‘కొందరు ఉద్యోగులు భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులందరికీ త్వరలోనే నేమ్ బ్యాడ్జ్ అందిస్తాం. దీని ద్వారా అమర్యాదగా వ్యవహరించే ఉద్యోగులను భక్తులు గుర్తించే అవకాశం ఉంటుంది’ అని Xలో బీఆర్ నాయుడు పోస్ట్ చేశారు.

News December 10, 2024

కుంభ‌మేళాకు 40 కోట్ల మంది భక్తులు!

image

Jan 13 నుంచి Feb 26 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న మ‌హా కుంభ‌మేళా- 2025కు ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి 40 కోట్ల మంది ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని UP ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. భ‌క్తుల సంఖ్య‌ను క‌చ్చిత‌త్వంతో నిర్ధారించేందుకు AI కెమెరాల‌ను ఉప‌యోగించ‌నున్నారు. జనసమూహం నిర్వహణలో కొత్త మైలురాయిని సృష్టించడం సహా ఇలాంటి స్మారక కార్యక్రమాల్లో ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తోంది.

News December 10, 2024

జైళ్ల‌ శాఖలో ఖాళీల‌ వివ‌రాలివ్వండి.. రాష్ట్రాల‌కు సుప్రీంకోర్టు ఆదేశం

image

జైళ్ల శాఖ‌లో ఉన్న పోస్టులు, ఖాళీలు-వాటి భర్తీ చర్యల వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని అన్ని రాష్ట్రాల‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కారాగారాలు నిండిపోతుండ‌డంపై దాఖ‌లైన పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా జస్టిస్ హృషికేశ్ రాయ్‌ బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది. జైళ్లు నిండిపోయి కారాగారాల్లో సిబ్బంది తక్కువగా ఉన్నప్పుడు ఖైదీలు, విచారణ ఖైదీల సమస్యలు పెరిగే అవకాశముందని పేర్కొంది. వివ‌రాలు స‌మ‌ర్పించేందుకు 8 వారాల గడువిచ్చింది.