News July 30, 2024

కష్టాల్లో టీమ్ ఇండియా

image

శ్రీలంకతో మూడో టీ20లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో టీమ్ ఇండియా 6 ఓవర్లలో 30 పరుగులకే కీలక 4 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్(10), శాంసన్(0), రింకూసింగ్(1), సూర్యకుమార్ యాదవ్(8) నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో గిల్(10), శివం దూబె(0) ఉన్నారు.

Similar News

News October 4, 2024

క్రూడ్ రేట్లకు ఫైర్ అంటించిన జో బైడెన్!

image

బ్రెంట్ క్రూడాయిల్ రేట్లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వ్యాఖ్యలే ఇందుకు కారణం. మొన్నటి వరకు బ్యారెల్ సగటున $70 పలికింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించడంతో పరిస్థితి మారింది. ఇరాన్ ఆయువుపట్టయిన ఆయిల్ ఫీల్డ్స్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల గురించి డిస్కస్ చేస్తామని జోబైడెన్ గురువారం చెప్పారు. దీంతో క్రూడ్ వెంటనే $75 డాలర్లకు చేరింది. ఇవాళ ఇంకా పెరిగే ఛాన్సుంది.

News October 4, 2024

నెల్సన్ కథకు ఓకే చెప్పిన జూ.ఎన్టీఆర్?

image

‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో జూ.ఎన్టీఆర్ ఓ సినిమాలో నటించే అవకాశం కన్పిస్తోంది. ఇటీవల దర్శకుడు చెప్పిన కథకు యంగ్ టైగర్‌ ఓకే చెప్పారని సమాచారం. వార్-2, ప్రశాంత్ నీల్ చిత్రాల తర్వాతే ఇది పట్టాలెక్కనుందని టాక్. మరోవైపు నెల్సన్ కూడా జైలర్-2 ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో NTR-నెల్సన్ చిత్రంపై అధికారిక ప్రకటన రావడానికి మరింత సమయం పట్టొచ్చని తెలుస్తోంది.

News October 4, 2024

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయని సీఎం రేవంత్ తెలిపారు. భవిష్యత్తులో 100% సన్నాలు పండించే రోజులు వస్తాయన్నారు. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు ₹500 బోనస్ చెల్లిస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. సన్న వడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు లేదా కొనుగోలు కేంద్రాల్లో వేర్వేరు కాంటాలు ఏర్పాటు చేస్తామన్నారు.