News November 3, 2024
సౌతాఫ్రికాకు బయలుదేరిన టీమ్ ఇండియా
టీ20 సిరీస్ కోసం భారత జట్టు సౌతాఫ్రికాకు బయలుదేరింది. సహచర ఆటగాళ్లతో కలిసి విమానంలో దిగిన ఫొటోను T20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. నవంబర్ 8 నుంచి 15 వరకు జరిగే ఈ సిరీస్‌లో 4 మ్యాచుల్లో భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి.
Similar News
News December 12, 2024
టూరిస్టులు లేక దీనస్థితిలో గోవా!
ఇండియన్ టూరిజం ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే గోవాలో ప్రస్తుతం సందడి తగ్గింది. ఈ ఏడాది గోవాలో తక్కువ మంది పర్యటించినట్లు తెలుస్తోంది. భారత టూరిస్టులంతా థాయ్‌లాండ్, మలేషియాకు వెళ్తున్నారు. గోవాలో సరైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు లేకపోవడం, టాక్సీల దోపిడీ వల్ల టూరిస్టులు వచ్చేందుకు మొగ్గు చూపట్లేదని హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News December 12, 2024
సినీ నటుడు మోహన్ బాబుపై మరో ఫిర్యాదు
మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మంచు విష్ణు నటిస్తున్న ఓ మూవీ ప్రమోషన్ల కోసమే వారు డ్రామా ఆడుతున్నారు. మోహన్ బాబుతోపాటు ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’ అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే.
News December 12, 2024
‘సరస్వతి’ భూములు వెనక్కి తీసుకున్న సర్కార్
AP: సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు చెందిన అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు పల్నాడు జిల్లా మాచవరం తహశీల్దార్ ఎం.క్షమారాణి తెలిపారు. మొత్తం 17.69 ఎకరాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలను ప్రభుత్వం తిరిగి తీసుకుంది. వేమవరం, చెన్నాయపాలెం, పిన్నెల్లి గ్రామాల పరిధిలో సరస్వతి కంపెనీకి దాదాపు 2 వేల ఎకరాల భూములు ఉన్నట్లు తెలుస్తోంది.