News December 18, 2024
రెండో టీ20లో టీమ్ ఇండియా ఓటమి

నవీ ముంబైలోని డా.డీవై పాటిల్ స్టేడియంలో భారత్తో జరిగిన రెండో T20లో వెస్టిండీస్ మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట IND 20 ఓవర్లలో 159/9 స్కోర్ చేసింది. స్మృతి మందాన (62) టాప్ స్కోరర్గా నిలిచారు. అనంతరం WI 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు కెప్టెన్ మాథ్యూస్ (47 బంతుల్లో 85) రాణించారు. 3 మ్యాచుల సిరీస్లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో T20 రేపు జరగనుంది.
Similar News
News December 1, 2025
ధాన్యం కొనుగోళ్లు.. రూ.2,300 కోట్లు జమ చేేశాం: నాదెండ్ల

AP: రాష్ట్రంలో ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.2,300 కోట్ల నగదును రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ధాన్యం నిల్వలకు సంచుల కొరత లేకుండా చూస్తున్నామని, టార్పాలిన్లు ఉచితంగా రైతులకు అందిస్తున్నామని చెప్పారు.
News December 1, 2025
పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత

తన ప్రియుడు, డైరెక్టర్ రాజ్ నిడిమోరును వివాహమాడినట్లు స్టార్ హీరోయిన్ సమంత ప్రకటించారు. ఇవాళ్టి డేట్, లవ్ ఎమోజీలతో పెళ్లి ఫొటోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు. కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవ ఆలయంలో తొలుత నిశ్చితార్థం చేసుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఉపాసన కొణిదెల, అనుపమతో పాటు తదితర సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
News December 1, 2025
హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

HYDలోని CSIR-<


