News December 16, 2024

4 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా

image

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మరోసారి వర్షం కారణంగా నిలిచిపోయింది. వర్షం మొదలయ్యే సమయానికి టీమ్ ఇండియా 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. పంత్ 9 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. క్రీజులో రాహుల్(30*), రోహిత్(1) ఉన్నారు. భారత్ ఇంకా 397 పరుగులు వెనుకబడి ఉంది.

Similar News

News January 16, 2025

సైఫ్‌పై కత్తితో దాడి.. స్పందించిన ఎన్టీఆర్

image

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన <<15167744>>దాడిపై<<>> యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యా. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. దీనిపై ‘దేవర’ టీమ్ సైతం స్పందిస్తూ.. ‘ఇది తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యాం. త్వరగా కోలుకోండి సైఫ్ సార్’ అని పేర్కొంది.

News January 16, 2025

Stock Markets: బెంచ్‌మార్క్ సూచీల దూకుడు

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, హిండెన్‌బర్గ్ షట్‌డౌన్ అంశాలు పాజిటివ్ సెంటిమెంటుకు దారితీశాయి. నిఫ్టీ 23,350 (+136), సెన్సెక్స్ 77,174 (+444) వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, PSU బ్యాంకు, రియాల్టి సూచీలు కళకళలాడుతున్నాయి. అదానీ షేర్లు పుంజుకున్నాయి. HDFCLIFE, ADANISEZ, SBILIFE, ADANIENT, SRIRAMFIN టాప్ గెయినర్స్.

News January 16, 2025

ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు: KTR

image

TG: ఫార్ములా-ఈ కేసులో ED విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో KTR ట్వీట్ చేశారు. ‘HYDలో ఈ ఈవెంట్ నిర్వహించినప్పుడు ఇతరులు మన నగరాన్ని ప్రశంసిస్తుంటే గర్వంగా అనిపించింది. HYD బ్రాండ్‌ను పెంచడమే నాకు ముఖ్యం. FEOకి ₹46cr బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశాం. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు. రాజకీయ కుట్రతో కేసు పెట్టారు. త్వరలోనే నిజం బయటకు వస్తుంది. మా పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.