News March 8, 2025
ఫైనల్ కోసం టీమ్ ఇండియా కసరత్తులు

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం టీమ్ ఇండియా కసరత్తులు చేస్తోంది. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రేపు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది.
Similar News
News November 14, 2025
రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ప్రశాంత్ కిశోర్.. జోరుగా చర్చ

బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ జన్ సురాజ్ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. 25 కంటే ఎక్కువ సీట్లను జేడీయూ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పీకే శపథం చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం జేడీయూ 25 సీట్లను సునాయాసంగా గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ ఒత్తిడి చేయడం వల్లే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందని జన్ సురాజ్ నేత అనుకృతి పేర్కొన్నారు.
News November 14, 2025
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి..

బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిన ఫలితాలను ఎన్డీయే నమోదు చేస్తోంది. ఎన్డీయే 130-160 సీట్ల వరకు సాధిస్తుందని మెజారిటీ సర్వే సంస్థలు చెప్పాయి. కానీ వాటన్నింటినీ తలకిందులు చేస్తూ అధికార కూటమి 190 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ 70-100 గెలుస్తుందన్న సర్వేల అంచనాలు నిజం కాలేదు. ఎంజీబీ కేవలం 50 లోపు సీట్లలోనే లీడ్‌లో ఉండటం గమనార్హం.
News November 14, 2025
200 సీట్లతో ఎన్డీయే గెలవబోతుంది: CBN

AP: బిహార్‌లో ఎన్డీయే ఘన విజయం దిశగా దూసుకెళ్తుండటంపై CM చంద్రబాబు స్పందించారు. విశాఖ CII పార్ట్‌నర్షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. 200 సీట్లతో ఎన్డీయే గెలవబోతుందని అన్నారు. ప్రజలంతా PM మోదీ వైపే ఉన్నారని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయన్నారు. దేశంలో ఇంతలా ప్రజా నమ్మకం పొందిన వ్యక్తి మోదీ తప్ప మరెవరూ లేరని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ శతాబ్దం నరేంద్ర మోదీది అని కొనియాడారు.


