News September 20, 2024

భారీ ఆధిక్యం దిశగా టీమ్ ఇండియా

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 308 పరుగులు ఆధిక్యంలో నిలిచింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా 4 వికెట్లతో చెలరేగారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్ (12), శుభ్‌మన్ గిల్ (33) ఉన్నారు.

Similar News

News October 15, 2024

అక్టోబర్ 15: చరిత్రలో ఈ రోజు

image

1931: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జననం
1933: డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి జననం
1939: నటుడు జీ రామకృష్ణ జననం
1953: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జననం
1987: హీరో సాయి ధరమ్ తేజ్ జననం
1994: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ జననం
2022: సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి మరణం
ప్రపంచ విద్యార్థుల దినోత్సవం
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం

News October 15, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 15, 2024

హీరో దర్శన్‌కు మరోసారి చుక్కెదురు

image

కన్నడ హీరో దర్శన్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సెషన్స్ కోర్టు కొట్టివేసింది. కాగా దర్శన్‌ను బళ్లారి జైలు నుంచి బెంగళూరు జైలుకు తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, బెంగళూరులో చికిత్స అందించాలని దర్శన్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది.