News April 5, 2024
టీమ్ ఇండియా పాక్ వెళ్లేది అప్పుడే: కేంద్రమంత్రి
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు వెళ్లే అంశంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘టీమ్ ఇండియాను పంపించేది లేనిది పూర్తిగా బీసీసీఐ నిర్ణయం. భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ ముందు ఆ పనిని ఆపాలి. అప్పుడే మన జట్టు అక్కడికి వెళ్తుంది’ అని స్పష్టం చేశారు. దీంతో వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది.
Similar News
News January 21, 2025
హైకోర్టులో మేరుగు నాగార్జునకు ఊరట
AP: వైసీపీ నేత మేరుగు నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన అత్యాచారం కేసును క్వాష్ చేయాలని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా తనను లైంగికంగా వేధించడంతోపాటు, తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఓ మహిళ మేరుగు నాగార్జునపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
News January 21, 2025
ఫిబ్రవరి 20లోపు పిల్లలు పుడితేనే..
అమెరికాలో ఇక గ్రీన్ కార్డు లేదా <<15212260>>పౌరసత్వం<<>> ఉంటేనే అక్కడ పుట్టే పిల్లలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించనుంది. ఫిబ్రవరి 20, 2025 నుంచి ఈ ఉత్తర్వులు అమలు కానున్నాయి. దీన్ని బట్టి గ్రీన్ కార్డు, పౌరసత్వం లేని వారు ఆ లోపు పిల్లలకు జన్మనిస్తేనే సిటిజన్‌షిప్ వస్తుంది. ఆ తర్వాత H1B, స్టూడెంట్ వీసా (F1), గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న వారు, విజిటింగ్ వీసా ఉన్న వారు అక్కడ పిల్లలను కంటే పౌరసత్వం వర్తించదు.
News January 21, 2025
క్రికెట్ టూర్లలో ఫ్యామిలీ ఉండాల్సిందే: బట్లర్
క్రికెట్ టూర్లలో తమ వెంట కుటుంబం ఉండాల్సిందేనని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అభిప్రాయపడ్డారు. వారు వెంట ఉండటం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ‘ఫ్యామిలీనే మాకు తొలి ప్రాధాన్యత. వారు మా వెంట ఉంటేనే ఎంజాయ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. టూర్ల సమయంలో భార్యలు, కుటుంబసభ్యులు మాతో ఉండడంతో చాలా దృఢంగా ఉంటాం. క్రికెట్, ఫ్యామిలీని మేనేజ్ చేసే సత్తా ఇప్పటి క్రికెటర్లకు ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.