News October 7, 2024

HK6 టోర్నీలో పాల్గొననున్న టీమ్‌ఇండియా

image

నవంబర్ 1 నుంచి జరిగే హాంగ్ కాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీ-2024లో భారత జట్టు పాల్గొనబోతోంది. ఈ టోర్నీకి ఇది 20వ ఎడిషన్ కాగా, గతంలో సచిన్, ధోనీ వంటి ప్లేయర్లు కూడా ఇందులో ఆడారు. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. ఇన్నింగ్స్‌కు 5 ఓవర్లు, టీమ్‌కు ఆరుగురు సభ్యులుంటారు. 3 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో పాకిస్థాన్ కూడా పాల్గొంటోంది. మన టీమ్ నుంచి ఎవరెవరు ఆడితే బాగుంటుందో కామెంట్ చేయండి.

Similar News

News March 10, 2026

యుద్ధం.. పడిపోతున్న బియ్యం ధరలు

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వరి రైతులపైనా ప్రభావం చూపుతోంది. చెన్నై పోర్టు నుంచి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం ఎగుమతులు ఆగిపోగా, ఇప్పటికే బయల్దేరిన కంటైనర్లూ వెనక్కి వచ్చేశాయి. దీంతో వారం కిందటి వరకు పుట్టి(850KG) ధాన్యం ధర ₹22,500 ఉండగా ప్రస్తుతం ₹21Kకు పడిపోయింది. ఇంకొన్ని రోజులు ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోతే రేట్లు మరింత పతనం కానున్నాయి. అలాగే $11.8Bn విలువైన ఆహారోత్పత్తుల ఎగుమతులపైనా ప్రభావం పడనుందని అంచనా.

News March 10, 2026

ఫైళ్ల దహనం వెనకున్న ప్లాన్ ఏంటో తేలాలి: సుప్రీంకోర్టు

image

AP: మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఫైళ్ల దహనం తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రికార్డు రూమ్‌లో మంటలు ఎలా అంటుకున్నాయి? దాని వెనకున్న ప్లాన్ ఏంటో లోతుగా విచారించాల్సి ఉందని తెలిపింది. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి సహా ఇతర నిందితుల ముందస్తు బెయిల్‌కు నిరాకరించింది. ఘటన సమయంలో నిందితుడు విదేశాల్లో ఉన్నారనే కారణంతో విచారణ నుంచి తప్పించుకోలేరని పేర్కొంది.

News March 10, 2026

ఈనెల 16 నుంచి వర్షాలు: వాతావరణ నిపుణులు

image

TG: రాష్ట్రంలో మరోసారి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 16 నుంచి 23 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం పడే ఛాన్సుందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఈ నెల 15 వరకు పొడి వాతావరణం ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33-40 డిగ్రీలుగా నమోదవుతున్నాయి.