News April 28, 2024
బంగ్లాదేశ్‌పై టీమ్‌ఇండియా విజయం
ఐదు మ్యాచుల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో భారత మహిళల జట్టు 44 రన్స్ తేడాతో గెలిచింది. మొదట భారత్ 145/7 స్కోర్ చేయగా, అనంతరం బంగ్లా 101/8కే పరిమితమైంది. భారత బ్యాటర్లలో యస్తికా 36, షఫాలీ 31, హర్మన్ ప్రీత్ 30 రన్స్ చేశారు. బౌలర్లలో రేణుక సింగ్ 3, పూజా వస్త్రాకర్ 2 వికెట్లు తీయగా, శ్రేయాంక, దీప్తి, రాధ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 మ్యాచ్ ఎల్లుండి జరగనుంది.
Similar News
News November 8, 2024
అందుకే కేటీఆర్‌ను అరెస్ట్ చేయట్లేదు: బండి
TG: కేటీఆర్‌తో కుదిరిన ఒప్పందంతోనే ఆయనను రేవంత్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. CM పాదయాత్ర చేయాల్సింది మూసీ నది పక్కన కాదని ఇళ్లు కూల్చిన ప్రాంతంలో అని ఎద్దేవా చేశారు. BJPకి స్పేస్ లేకుండా కాంగ్రెస్, BRS డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసులపై హంగామా చేశారన్నారు. ఇప్పుడు ఎలాంటి చప్పుడు లేదన్నారు.
News November 8, 2024
సమోసాల మిస్సింగ్‌పై నో ఎంక్వైరీ: CID
హిమాచల్ ప్రదేశ్ CID ఆఫీసులో సమోసాలు మిస్ అవ్వడంపై అధికారికంగా ఎలాంటి విచారణకు ఆదేశించలేదని DG సంజీవ్ రంజన్ తెలిపారు. CM సుఖ్వీందర్ సింగ్ పాల్గొన్న సమావేశంలో అతిథుల కోసం తెప్పించిన స్నాక్స్ ప్యాకెట్లు కనిపించకపోవడంతో అధికారులు వాటి కోసం వెతికారని వెల్లడించారు. ఇదో సామాన్యమైన అంతర్గత విషయమన్నారు. బాక్సులను వెతికేందుకు కేవలం అప్పీల్ చేశామన్నారు. దీన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
News November 8, 2024
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట.. సీఎం రేవంత్ ఆదేశం
TG: యాదాద్రి ఆలయం పేరును మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా పేరు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇకపై రికార్డుల్లో ఇదే కొనసాగించాలని సూచించారు. ఇక టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై జరిపిన సమీక్షలో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.