News October 15, 2024
నొప్పితో చంపేసే TECH NECK
ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లను గ్యాప్ లేకుండా వాడుతుంటే మెడ కండరాలపై ఒత్తిడిపడి నొప్పి పుట్టడాన్నే Tech/Text Neck అంటారు. సుదీర్ఘకాలం ఇలాగే ఉంటే మెడ కండరాలు దెబ్బతింటాయి. వెన్నెముక వంగుతుంది. కూర్చొనే తీరు మారిపోయి కీళ్లు, నరాల్లో ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. డిస్కులు పక్కకు తొలుగుతాయి. డిస్క్ బల్జ్ వస్తుంది. వెన్ను వంగడంతో వీపు మొద్దుబారడం, తిమ్మిర్లు, లోయర్ బ్యాక్ పెయిన్, తలనొప్పి కలుగుతాయి. >Share
Similar News
News November 14, 2024
‘కంగువా’ మూవీ రివ్యూ & RATING
1000 ఏళ్ల క్రితం తన జాతి, ఓ పిల్లాడి తల్లికి ఇచ్చిన మాట కోసం హీరో చేసిన పోరాటమే కంగువా కథ. తన పర్ఫామెన్స్, యాక్షన్ సీన్లతో సూర్య మెప్పించారు. విజువల్స్ బాగున్నాయి. సినిమా స్థాయికి తగ్గట్లుగా బలమైన ఎమోషన్ సీన్లు లేకపోవడం మైనస్. మ్యూజిక్ బాగున్నా అక్కడక్కడ లౌడ్ BGM ఇబ్బంది కలిగిస్తుంది. ప్రస్తుతానికి, గత జన్మకు డైరెక్టర్ సరిగా లింక్ చేయలేకపోయారు. ఫస్టాఫ్ స్లోగా ఉంటుంది.
RATING: 2.25/5
News November 14, 2024
బ్రెజిల్ సుప్రీం కోర్టు వద్ద బాంబు పేలుళ్లు
బ్రెజిల్‌లో ఏకంగా సుప్రీం కోర్టును పేల్చేందుకు ఓ దుండగుడు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. పేలుడు పదార్థాలతో వచ్చిన సూసైడ్ బాంబర్ ప్రవేశ ద్వారం వద్దే అవి పేలిపోవడంతో మరణించాడని అధికారులు తెలిపారు. అతడి వివరాలతో పాటు వెనుక ఎవరున్నారనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి బ్రెజిల్‌లో జీ20 సదస్సు జరగనుండగా ఈ పేలుడు సంభవించడం చర్చనీయాంశంగా మారింది.
News November 14, 2024
కార్తీక మాసంలో ఉసిరిని ఎందుకు పూజిస్తారంటే..
మహావిష్ణువుకు ప్రతిరూపంగా భావించే ఉసిరిని కార్తీక మాసంలో పూజించి దాని వద్ద దీపం వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఉసిరిలో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. ఎండ తక్కువగా ఉండే చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉసిరి ఉపకరిస్తుందని శాస్త్రీయ వివరణ. కార్తీక వన భోజనాలు సైతం ఉసిరి చెట్ల నీడలో చేయాలని పెద్దలు పేర్కొనడం గమనార్హం.