News April 10, 2024
రిజైన్‌కు సిద్ధపడుతున్న టెక్ మహిళా ఉద్యోగులు!

టెక్ కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల్లో 31శాతం మంది మరో 12 నెలల్లో తమ ఉద్యోగాలకు రాజీనామా చేయనున్నట్లు స్కిల్‌సాఫ్ట్ సంస్థ నివేదిక వెల్లడించింది. కంపెనీ యాజమాన్యంపై 40% మంది, గ్రోత్ లేదా ట్రైనింగ్ లేకపోవడంతో 39%, మెరుగైన జీతం లేక 26% మంది అసంతృప్తితో ఉన్నారట. 85% మంది మహిళలు తాము లింగ వివక్షను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారట. 2023 సెప్టెంబరు-2024 జనవరి మధ్య సంస్థ ఈ ఆన్‌లైన్ సర్వే చేపట్టింది.
Similar News
News March 25, 2025
50 ఏళ్లకే వృద్ధులవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు: కూనంనేని

TG: అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు 50 ఏళ్లకే వృద్ధులవుతున్నారని ఆయన అన్నారు. వీరికి కార్మిక చట్టాలు అమలవుతాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రమ, మేధ దోపిడీ ఇక్కడే జరుగుతోందని పేర్కొన్నారు. ఎవ్వరితోనూ సంబంధం లేకుండా, పగలు, రాత్రి తెలియకుండా వారు జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ ఉద్యోగులపై దృష్టి సారించాలని కోరారు.
News March 25, 2025
రేపు 108 మండలాల్లో వడగాలుల ప్రభావం

AP: రేపు రాష్ట్రంలోని <
News March 25, 2025
గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు: బొత్స

AP: చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ధర లేక చెరుకు పంటను రైతులే కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు.