News November 15, 2024
ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్టు తెలుస్తోంది. మోదీ శుక్రవారం ఝార్ఖండ్ పర్యటన ముగించుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో దేవ్‌ఘర్ విమానాశ్రయంలో ఉన్న విమానంలో సమస్య తలెత్తినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై PM Office స్పందించాల్సి ఉంది. మోదీ తిరుగు ప్రయాణం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Similar News
News November 15, 2024
కంగువా: నిన్న విడుదల.. ఇవాళ ఆన్‌లైన్‌లో..
సూర్య నటించిన ‘కంగువా’ మూవీని పైరసీ భూతం వెంటాడుతోంది. నిన్న విడుదలైన ఈ సినిమా పలు వెబ్‌సైట్లలో దర్శనమివ్వడం మేకర్స్‌ని షాకింగ్‌కు గురి చేస్తోంది. తమిళ్ రాకర్స్, ఫిల్మీజిల్లా, మూవీ రూల్స్, టెలిగ్రామ్ తదితర సైట్లలో కంగువా HD ప్రింట్ అందుబాటులో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రూ.కోట్లు ఖర్చు పెట్టిన సినిమాను ఇలా పైరసీ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూర్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
News November 15, 2024
2800 ఏళ్ల నాటి అమర ప్రేమ ఇది!
కొన్ని ప్రేమ కథలు కాలాల్ని దాటి ప్రయాణిస్తాయి. అలాంటిదే ఈ కథ. ఆర్కియాలజిస్టుల కథనం ప్రకారం.. 2800 ఏళ్ల క్రితం ఇరాన్‌లోని టెప్పే హసన్లు ప్రాంతానికి చెందిన ఓ జంట, తమ తండాలో కార్చిచ్చు నుంచి పారిపోతూ ఓ గుంతలో తలదాచుకున్నారు. మృత్యువు వెంటాడటంతో ప్రాణాలు పోయే చివరి క్షణంలో ఒకరినొకరు ముద్దాడారు. 1972లో ఈ ప్రేమికుల అస్థిపంజరాలు వెలుగుచూశాయి. ఆ ప్రాంతం పేరిట వీరిని ‘హసన్లూ ప్రేమికులు’గా పిలుస్తున్నారు.
News November 15, 2024
మోక్షజ్ఞ సినిమాలో విక్రమ్ తనయుడు?
నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మూవీలో విలన్ రోల్‌కి తమిళ నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్‌ను సంప్రదించారని భోగట్టా. అందుకాయన సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఇక హీరోయిన్‌గా రవీనా టాండన్ కుమార్తె రాశా థడానీని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య క్లైమాక్స్‌లో ప్రత్యేక పాత్రలో తళుక్కుమంటారని మూవీ టీమ్ చెబుతోంది.