News January 15, 2025
ఇంటి వద్దకే టెక్నీషియన్లు.. తక్కువ ధరకే సర్వీస్: టీడీపీ

AP: వృత్తిదారులను ఆదుకునేందుకు CM CBN ఆదేశాలతో ‘హోమ్ ట్రయాంగిల్ యాప్’తో మెప్మా ఒప్పందం చేసుకుందని TDP వెల్లడించింది. ‘20వేల మంది టెక్నీషియన్లకు మెప్మా శిక్షణ ఇస్తోంది. TV, AC, ఫ్రిజ్, కంప్యూటర్ తదితర 30 రకాల డివైజ్‌లు పాడైతే టెక్నీషియన్లు ఇంటి వద్దకే వచ్చి తక్కువ ధరకే బాగుచేస్తారు. MAR నుంచి 123 పట్టణాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో టెక్నీషియన్‌కు ₹20-25వేల ఆదాయం వస్తుంది’ అని పేర్కొంది.
Similar News
News February 11, 2025
APSRTC ఉద్యోగులకు తీపికబురు

APSRTC ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2017 పీఆర్సీ బకాయిలో మరో 25 శాతం చెల్లింపునకు సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో దాదాపు రూ.60 కోట్ల మేర ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా ఇప్పటికే 50 శాతం బకాయిలు చెల్లించినట్లు ఆయన గతంలో వెల్లడించారు.
News February 11, 2025
మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?

TG: రైతు భరోసా పథకం కింద జనవరి 27 నుంచి ఇప్పటి వరకు 30,11,329 మంది రైతులకు ₹1,834.09 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 27న 577 ఎంపిక చేసిన గ్రామాల్లో 4.41 లక్షల మందికి, ఫిబ్రవరి 5న ఎకరం లోపు సాగు చేస్తున్న 17.03లక్షల మందికి, ఇవాళ 2 ఎకరాలలోపు సాగు చేస్తున్న 8.65 లక్షల మంది ఖాతాల్లో రూ.707.54 కోట్లు జమ చేసినట్లు తెలిపింది. మరి మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?
News February 10, 2025
ALERT.. నోటిఫికేషన్ విడుదల

AP మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి జూనియర్ ఇంటర్, 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. FEB 15 నుంచి MAR 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 6, 7, 8, 9, తరగతుల్లో బ్యాక్ లాగ్ అడ్మిషన్లకు సైతం అప్లై చేయవచ్చు. జూనియర్ ఇంటర్‌కు ఏప్రిల్ 20, 5వ తరగతికి ఏప్రిల్ 27, బ్యాక్ లాగ్ క్లాసుల్లో చేరే వారికి ఏప్రిల్ 28న పరీక్ష ఉంటుంది.