News March 12, 2025
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. అంతకుముందు గవర్నర్ మాట్లాడుతూ ‘260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో తెలంగాణ రికార్డు సృష్టించింది. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.
Similar News
News March 12, 2025
త్వరలో ఆల్ పార్టీ మీటింగ్: భట్టి

TG: దేశంలో త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరగనుండగా, దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో పాల్గొనాలని అన్ని పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి లేఖలు రాశారు. త్వరలోనే అఖిలపక్ష భేటీ తేదీ, వేదిక ప్రకటిస్తామని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అందరూ ఈ సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
News March 12, 2025
దళితులకు ఆలయ ప్రవేశం కల్పించిన అధికారులు

పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో ఆలయ ప్రవేశం కోసం దళితులు చేస్తున్న పోరాటానికి ఫలితం లభించింది. గిధగ్రాంలో ఐదుగురు దళితులను పోలీసులు ప్రత్యేక భద్రతతో శివాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం వారితో ప్రత్యేక పూజలు జరిపించారు. గ్రామంలో దాదాపు 6 శాతమున్న తమకు కులవివక్ష పేరుతో ఇన్నేళ్లుగా ఆలయ ప్రవేశం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు లేఖ రాయడంతో తమకు న్యాయం జరిపించారని సంతోషం వ్యక్తం చేశారు.
News March 12, 2025
మోహన్ బాబుకు మద్దతు తెలిపిన సౌందర్య భర్త

సినీనటుడు మోహన్ బాబుకు మద్దతు తెలుపుతూ దివంగత నటి సౌందర్య భర్త రఘు ఓ లేఖ రాశారు. ‘మోహన్ బాబుకు, సౌందర్యకు మధ్య ఎలాంటి గొడవలు, భూ లావాదేవీలు లేవు. నా భార్యకు సంబంధించిన ఏ ఆస్తిని ఆయన స్వాధీనం చేసుకోలేదు. సౌందర్య మరణించక ముందు, ఆ తర్వాత కూడా మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయంలో వస్తున్న <<15732112>>ఆరోపణలన్నీ<<>> అవాస్తవాలు. మేమంతా ఒక కుటుంబంలాగా ఉంటాం. క్లారిటీ ఇవ్వడానికే నేను స్పందించా’ అని పేర్కొన్నారు.