News August 11, 2024
రాజకీయాల వల్ల తెలంగాణ బ్రాండ్ దెబ్బతినకూడదు: KTR

రాజకీయ విభేదాల వల్ల తెలంగాణ బ్రాండ్ దెబ్బతినకూడదని KTR అన్నారు. ‘TG ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అమర్‌రాజా కంపెనీ మరో రాష్ట్రానికి వెళ్లవచ్చు’ అని ఆ సంస్థ ఛైర్మన్ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించిన వార్తను Xలో షేర్ చేశారు. ‘₹9,500 కోట్ల పెట్టుబడులకు అమరరాజా సంస్థను ఒప్పించాం. ప్రభుత్వం ఈ డీల్‌ను కొనసాగించాలి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ ప్రకటనలు చేయడం CM మానుకోవాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 13, 2025
బిగ్‌బాస్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. సీజన్ ఇంకో వారమే మిగిలుంది కాబట్టి హౌస్‌లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఆదివారం ఎపిసోడ్లో సంజన/భరణి/డెమోన్ పవన్‌లో ఒకరు ఎలిమినేటయ్యే ఛాన్సులున్నాయని SMలో పోస్టులు వైరలవుతున్నాయి.
News December 13, 2025
బేబీ మసాజ్‌కు బెస్ట్ ఆయిల్స్ ఇవే..

పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. అయితే దీనికోసం ప్లాంట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నా కూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించొచ్చంటున్నారు. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఆభరణాలు ఉండకుండా చూసుకోవాలి.


