News August 11, 2024

రాజకీయాల వల్ల తెలంగాణ బ్రాండ్ దెబ్బతినకూడదు: KTR

image

రాజకీయ విభేదాల వల్ల తెలంగాణ బ్రాండ్ దెబ్బతినకూడదని KTR అన్నారు. ‘TG ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అమర్‌రాజా కంపెనీ మరో రాష్ట్రానికి వెళ్లవచ్చు’ అని ఆ సంస్థ ఛైర్మన్ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించిన వార్తను Xలో షేర్ చేశారు. ‘₹9,500 కోట్ల పెట్టుబడులకు అమరరాజా సంస్థను ఒప్పించాం. ప్రభుత్వం ఈ డీల్‌ను కొనసాగించాలి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ ప్రకటనలు చేయడం CM మానుకోవాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News September 19, 2024

జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఉదయభాను

image

AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 22న ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. రేపు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఉదయభాను మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ప్రభుత్వ విప్‌గా పని చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సైతం ఈ నెల 22న జనసేనలో చేరే అవకాశం ఉంది.

News September 19, 2024

టూరిజాన్ని గాడినపెట్టేందుకు కృషి: మంత్రి దుర్గేశ్

image

AP: రాష్ట్రంలో టూరిజాన్ని తిరిగి గాడినపెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. వచ్చే నెల 15 కల్లా టూరిజంపై DPR రూపొందించి కేంద్రానికి ఇస్తామని మీడియాతో తెలిపారు. స్వదేశీ టూరిజంతో అరకు, లంబసింగి ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు సహకరిస్తామని చెప్పారు. నంది అవార్డుల ప్రదానంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

News September 19, 2024

చెప్పిన తేదీకే మెగాస్టార్ ‘విశ్వంభర’ విడుదల

image

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీలో మార్పులుంటాయని వస్తోన్న వార్తలపై డైరెక్టర్ వశిష్ట క్లారిటీ ఇచ్చారు. ‘10-1-2025 విజృంభణం.. విశ్వంభర ఆగమనం!’ అని ట్వీట్ చేశారు. దీంతో ‘విశ్వంభర’ సంక్రాంతికి రిలీజ్ అవనుంది. అయితే, మూవీ టీజర్ అయినా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూడు నెలలు కూడా లేదని, అప్డేట్స్ ఇస్తూ మూవీపై ఆసక్తి పెంచాలని కోరుతున్నారు.