News March 8, 2025

18 లేదా 19న తెలంగాణ బడ్జెట్?

image

TG: ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.. అనంతరం ఈ నెల 18 లేదా 19న బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్, శాఖల వారీ పద్దులపై చర్చ అనంతరం 27న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది.

Similar News

News November 6, 2025

స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

TG: అన్ని స్కూళ్లలో రేపు ఉదయం 10 గంటలకు వందేమాతరం ఆలపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్రం చెప్పిన నేపథ్యంలో సర్కార్ తాజాగా ఉత్తర్వులిచ్చింది. పాఠశాలలతో పాటు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా వందేమాతరం పాడాలని అందులో పేర్కొంది. ఇక దేశ ప్రజలంతా ఇందులో పాల్గొనాలని కేంద్రం కోరింది.

News November 6, 2025

ట్రంప్ ఉక్కుపాదం.. 80వేల వీసాల రద్దు

image

అక్రమ వలసదారులతోపాటు వీసాలపై వచ్చి ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. జనవరి నుంచి 80వేల వీసాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. హింస, దాడులు, చోరీ, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వారే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గడువు ముగిసినా దేశంలో ఉండటం, స్థానిక చట్టాలను లెక్కచేయని 6వేలకు పైగా స్టూడెంట్ల వీసాలూ రద్దయినట్లు మీడియా తెలిపింది.

News November 6, 2025

వాణిజ్య కూడళ్ల సమీపంలో నివాసం ఉండొచ్చా?

image

బహుళ అంతస్తుల భవనాల సమీపంలో, వాణిజ్య కేంద్రాలు, వ్యాపార కూడళ్లలో నివాసం ఉండడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తారు. ఈ ప్రాంతాలలో నిరంతర శబ్దం వల్ల అధిక ప్రతికూల శక్తి వస్తుందంటారు. ‘ఇది ఇంటికి శాంతిని, నివాసితులకు ప్రశాంతతను దూరం చేస్తుంది. వ్యాపార కూడళ్ల చంచలత్వం నివాస స్థలంలో స్థిరత్వాన్ని లోపింపజేస్తుంది. శుభకరమైన జీవనం కోసం ఈ స్థలాలకు దూరంగా ఉండాలి’ అని చెబుతారు. <<-se>>#Vasthu<<>>