News May 20, 2024

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ!

image

ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో తెలంగాణ కేబినెట్ నేడు భేటీ కానుంది. ఈసీ ఆంక్షల పరిధిలోకి రాని అంశాలపైనే ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్ 4లోపు చేయవల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని, రైతు రుణమాఫీ వంటి అంశాలను పక్కనపెట్టాలని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అలాగే ఎన్నికల నిర్వహణలో భాగమైన ప్రభుత్వ అధికారులను ఈ భేటీకి హాజరుకావొద్దని ఆదేశించింది.

Similar News

News October 31, 2025

సీపీఎం నేత దారుణ హత్య

image

TG: ఖమ్మం జిల్లా CPM రైతు సంఘం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఉదయం చింతకాని(M) పాతర్లపాడులో వాకింగ్‌కు వెళ్లిన సమయంలో దుండగులు గొంతుకోసి హత్య చేశారు. ఈయన ఉమ్మడి APలో సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పని చేశారు. రామారావు హత్య పట్ల Dy.CM భట్టి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు.

News October 31, 2025

PHOTO: సీఎం రేవంత్‌తో సల్మాన్ ఖాన్

image

TG CM రేవంత్‌తో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భేటీ అయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ శిండే మనవరాలి పెళ్లి సందర్భంగా నిన్న ముంబై వెళ్లిన రేవంత్‌తో సల్మాన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ నినాదానికి వరల్డ్ వైడ్‌గా ప్రచారం కల్పిస్తానని సల్మాన్ చెప్పినట్లు సమాచారం.

News October 31, 2025

ఐపీవోకు Groww

image

స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ‘గ్రో’ మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ NOV 4-7 మధ్య పబ్లిక్ ఇష్యూకు రానుంది. షేర్ల ధరలను రూ.95-100గా నిర్ణయించింది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ.1,060Cr విలువైన షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద 55.72 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, వాటాదార్లు విక్రయించనున్నారు. దీంతో రూ.6,632Cr సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. తద్వారా సంస్థ విలువ రూ.61,700Crకు చేరొచ్చని అంచనా.