News May 19, 2024

రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం

image

TG: కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మ.3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం నిన్ననే భేటీ జరగాల్సి ఉండగా, ఈసీ తొలుత అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఇవాళ పలు షరతులతో ఓకే చెప్పింది. అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని, రుణమాఫీ, ఉమ్మడి రాజధాని విషయాల జోలికి వెళ్లొద్దని స్పష్టం చేసింది.

Similar News

News December 10, 2024

ఉద్యోగులను తొలగించలేదు: YES MADAM

image

పనిలో ఒత్తిడికి లోనవుతున్నామని చెప్పిన ఉద్యోగులను <<14833339>>తొలగించడంపై<<>> ‘YES MADAM’ కంపెనీపై తీవ్ర విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. పక్కా ప్రణాళికతోనే ఇలా చేశారంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో సదరు కంపెనీ స్పందిస్తూ ఎవరినీ తొలగించలేదని స్పష్టం చేసింది. అయితే, ఉన్నట్టుండి ఉద్యోగాలు కోల్పోయిన వంద మందికి ఉద్యోగాలిచ్చేందుకు సిద్ధమని ‘MAGICPIN’ అనే మరో కంపెనీ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసింది.

News December 10, 2024

బాక్సింగ్ డే టెస్ట్.. ఫస్ట్ డే టికెట్లన్నీ సేల్

image

ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డే టెస్టుకు ఉన్న క్రేజే వేరు. ఆ మ్యాచ్ తొలి రోజుకు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. ఈ నెల 26న మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో మ్యాచ్ జరగనుండగా ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ లక్షగా ఉంది. మ్యాచ్‌కు 15 రోజుల ముందే టికెట్లన్నీ అమ్ముడవడం గమనార్హం. కాగా మూడో టెస్టు ఈ నెల 14న గబ్బా స్టేడియంలో జరగనుంది.

News December 10, 2024

మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ: AISF

image

మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై AP ప్రభుత్వం విచారణ చేయించాలని AISF జాతీయ కార్యదర్శి శివారెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘MBUలో ఫీజుల దోపిడీపై మంచు మనోజ్ స్టేట్‌మెంట్‌ను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి. ప్రతి విద్యార్థి దగ్గర ఏటా ₹20,000 అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించిన పేరెంట్స్‌ను మోహన్ బాబు బౌన్సర్లతో కొట్టిస్తున్నారు. స్టూడెంట్స్‌ను ఫెయిల్ చేయిస్తున్నారు’ అని ఆరోపించారు.