News February 4, 2025

తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శం: షర్మిల

image

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం అని ఆ పార్టీ AP అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ‘ఇదో చరిత్రాత్మక ఘట్టం. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనం. జనాభాలో 56% బీసీలు, 17% ఎస్సీలు, 10% ఎస్టీలు.. అంటే దాదాపు 90% వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశం. ఇలాగే APలోనూ లెక్కలు తీయాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.

Similar News

News December 29, 2025

ఆ ఎమ్మెల్యేలకు డోర్స్ క్లోజ్: కేటీఆర్

image

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాకుండా తమ పార్టీ తలుపులు మూసుకున్నాయని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామని చిట్ చాట్‌లో తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తాము ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని గతి పట్టిందని దుయ్యబట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలిందని, ఆ భయంతోనే మున్సిపల్ ఎన్నికలు పెట్టట్లేదని ఎద్దేవా చేశారు.

News December 29, 2025

వెండి మరో రికార్డ్.. రెండో అత్యంత విలువైన అసెట్

image

కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న వెండి ధరలు మరో రికార్డ్ నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 84 డాలర్లకు చేరింది. దీంతో $4.65 ట్రిలియన్ల వాల్యూతో ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన అసెట్‌(గోల్డ్ తర్వాత)గా నిలిచింది. ప్రముఖ టెక్ సంస్థ ఎన్విడియాను ($4.63 ట్రిలియన్లు) కూడా వెండి వెనక్కి నెట్టడం విశేషం. భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ విలువ తగ్గటంతో వెండికి ఈ మధ్య డిమాండ్ పెరిగింది.

News December 29, 2025

రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు తిరుమలకు వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాగా ఈ అర్ధరాత్రి నుంచి తిరుమలలో ఉత్తరద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.