News February 4, 2025

తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శం: షర్మిల

image

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం అని ఆ పార్టీ AP అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ‘ఇదో చరిత్రాత్మక ఘట్టం. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనం. జనాభాలో 56% బీసీలు, 17% ఎస్సీలు, 10% ఎస్టీలు.. అంటే దాదాపు 90% వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశం. ఇలాగే APలోనూ లెక్కలు తీయాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.

Similar News

News January 15, 2026

స్పైస్ బోర్డ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

AP: గుంటూరులోని స్పైస్ బోర్డ్‌ 3 SRD ట్రైనీస్, ట్రైనీ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. బీఎస్సీ అర్హత గల వారు ఫిబ్రవరి 4న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. నెలకు జీతం రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.indianspices.com

News January 15, 2026

నేడే పెద్ద పండుగ.. తెలుగు లోగిళ్లలో సంబరాలు

image

తెలుగు రాష్ట్రాలకు అతిపెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య ఘడియతో భోగభాగ్యాలు వస్తాయని విశ్వసిస్తారు. పంటలు ఇంటికి చేరే వేళ కావడంతో ఇది రైతుల పండుగగా ప్రసిద్ధి చెందింది. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు పల్లెల్ని పండుగ కళతో నింపేస్తాయి. పిండి వంటకాలతో ఇళ్లు పరిమళిస్తాయి. దేశవ్యాప్తంగా పొంగల్‌, లోహ్రీ, మాఘ బిహు పేర్లతో ఈ పండుగను జరుపుకుంటున్నారు.

News January 15, 2026

నేటి నుంచి అందుబాటులోకి వెస్ట్ బైపాస్‌

image

AP: విజయవాడ వెస్ట్ బైపాస్‌ను నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గుంటూరు జిల్లా కాజా-చినకాకాని జంక్షన్ నుంచి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి మీదుగా చిన్న అవుటుపల్లి టోల్‌గేట్‌ జంక్షన్ వరకు ఒకవైపు రహదారిపై అన్ని రకాల వాహనాలకు అనుమతిస్తున్నట్లు NHAI తెలిపింది. గుంటూరు, అమరావతి, విజయవాడ, హైదరాబాద్, ఏలూరు, ఉత్తరాంధ్ర వైపు వెళ్లే వాహనాలకు ఇది కీలక మార్గంగా మారనుంది.