News November 17, 2024
తెలంగాణ రికార్డు సృష్టించింది: ఉత్తమ్
వరి దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడం రైతులు సాధించిన ఘన విజయమని అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజ్‌ల్లో నీటి వినియోగం లేకుండానే దిగుబడి సాధించడం ప్రభుత్వం, అధికారుల పనితీరు, రైతన్నల అంకితభావానికి నిదర్శనమన్నారు. ఉమ్మడి APలోనూ ఇంతటి పంట పండిన సందర్భమే లేదన్నారు.
Similar News
News December 8, 2024
ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం కొత్త రూల్స్
అత్యవసర పరిస్థితుల్లో ఐజీ లేదా ఆ పైస్థాయి పోలీస్ ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశించవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ట్యాపింగ్‌కు ఆదేశించిన అధికారి సదరు ఆదేశాలు నిజమైనవేనని 7 పనిదినాల్లో నిర్ధారించకపోతే ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటాను దేనికీ వాడొద్దని, 2 రోజుల్లో ఆ డేటాను ధ్వంసం చేయాలని తెలిపింది. ట్యాపింగ్ ఆదేశాలను సంబంధిత శాఖల కార్యదర్శుల కమిటీ సమీక్షించాల్సి ఉంటుందని పేర్కొంది.
News December 8, 2024
12న ఏపీలో భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది 11న శ్రీలంక- తమిళనాడు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో 12న ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నేడు అనకాపల్లి, విశాఖ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
News December 8, 2024
యాదగిరిగుట్టకు రికార్డ్ స్థాయి ఆదాయం
TG: కార్తీకమాసంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, హుండీల ద్వారా యాదగిరిగుట్టకు రికార్డ్ స్థాయి ఆదాయం వచ్చింది. ఒక్క నెలలో రూ.18.03కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. గతేడాది ఇదే మాసంలో రూ.15.08 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆలయం విమాన గోపురం బంగారు తాపడం కోసం రూ.25.52లక్షలు వచ్చినట్లు అధికారి వివరించారు.