News March 16, 2024
తెలంగాణ పెనం నుంచి పొయ్యిలో పడింది: మోదీ
TG: గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి NDA ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ‘రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ రూపంలో రెండు విసురురాళ్ల మధ్య ఇరుక్కుపోయారు. ప్రజల కలలను ఈ రెండు పార్టీలు పొడి చేశాయి. ఇప్పుడు రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లింది. గొయ్యిలో నుంచి బయటికి వస్తే నుయ్యిలోకి.. పెనం నుంచి పొయ్యిలో పడినట్లయింది’ అని మోదీ ఎద్దేవా చేశారు.
Similar News
News November 21, 2024
అద్దె బస్సుల ఛార్జీలు తగ్గించిన TGSRTC
పెళ్లిళ్లు, టూర్ల కోసం ప్రయాణికులకు అద్దెకు ఇచ్చే బస్సుల ఛార్జీలను TGSRTC తగ్గించింది. పల్లె వెలుగు బస్సు అద్దె గతంలో కిలోమీటర్‌కు రూ.68 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.52కు తగ్గించింది. ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.69 తీసుకోగా ఇప్పుడు రూ.62కు కుదించింది. డీలక్స్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.65 నుంచి రూ.57కు తగ్గించింది. సూపర్ లగ్జరీ బస్సులకు రూ.65 నుంచి రూ.59కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
News November 21, 2024
BREAKING: కేసుపై స్పందించిన అదానీ గ్రూప్
వ్యాపారవేత్త గౌతం అదానీపై USలోని న్యూయార్క్‌లో నమోదైన లంచం, ఫ్రాడ్ <<14666429>>కేసుపై <<>>అదానీ గ్రూప్ స్పందించింది. అవన్నీ అసత్య ఆరోపణలేనని తేల్చి చెప్పింది. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తామని చెప్పింది.
News November 21, 2024
CM రేవంత్‌పై పరువు నష్టం దావా విచారణ వాయిదా
TG: సీఎం రేవంత్‌రెడ్డిపై దాఖలైన పరువునష్టం దావా కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. BJPకి ఓటు వేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఎన్నికల సమయంలో రేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ BJP నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.