News March 16, 2024

తెలంగాణ పెనం నుంచి పొయ్యిలో పడింది: మోదీ

image

TG: గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి NDA ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ‘రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ రూపంలో రెండు విసురురాళ్ల మధ్య ఇరుక్కుపోయారు. ప్రజల కలలను ఈ రెండు పార్టీలు పొడి చేశాయి. ఇప్పుడు రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లింది. గొయ్యిలో నుంచి బయటికి వస్తే నుయ్యిలోకి.. పెనం నుంచి పొయ్యిలో పడినట్లయింది’ అని మోదీ ఎద్దేవా చేశారు.

Similar News

News October 11, 2024

IR ప్రకటించాలని ఉద్యోగుల డిమాండ్

image

AP: దసరా కానుకగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ DAలు, PRC, IR ప్రకటించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏ ప్రభుత్వం ఉన్నా దసరా కానుకగా IR ప్రకటించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపింది. నూతన వేతన సవరణ కోసం కమిటీకి వెంటనే ఛైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది. గత ప్రభుత్వం వేసిన కమిటీ ఛైర్మన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నట్లు పేర్కొంది.

News October 11, 2024

ఫేమస్ వెబ్‌సైట్‌ హ్యాక్: 3 కోట్ల పాస్‌వర్డ్స్ చోరీ

image

Internet Archive వెబ్‌సైట్‌పై ప్రో పాలస్తీనా హ్యాకర్లు దాడిచేశారు. 3.1 కోట్ల మంది పర్సనల్ డేటా, ఈ-మెయిల్ అడ్రస్‌లు, స్క్రీన్ నేమ్స్, ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్స్‌ను చోరీచేశారు. అక్టోబర్ 9న జావాస్క్రిప్ట్ లైబ్రరీ ఆధారంగా హ్యాకర్లు డేటా‌బ్రీచ్‌‌కు పాల్పడ్డారు. వారి నుంచి 6.4GB డేటాబేస్ అందినట్టు Have I Been Pwned? ఫౌండర్ ట్రాయ్ హంట్ తెలిపారు. తామే హ్యాకింగ్ అటాక్స్‌ చేశామని SN_BlackMeta తెలిపింది.

News October 11, 2024

మహిషాసురమర్దనిగా దుర్గమ్మ దర్శనం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఇవాళ మహిషాసురమర్దనిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో సింహ వాహనంపై కొలువుదీరారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని, ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.