News April 7, 2025

ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

image

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, DPR వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు బోర్డు కనీస సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అధికారులు మాత్రం DPR తయారు చేయలేదని చెప్పుకొచ్చారు.

Similar News

News January 18, 2026

వాహనదారులకు నెల్లూరు ఎస్పీ సూచనలు

image

నెల్లూరు జిల్లాలో పొగ మంచు ఎక్కువైంది. ఈక్రమంలో వాహనదారులకు ఎస్పీ డా.అజిత వేజెండ్ల పలు సూచనలు చేశారు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగించాలన్నారు. వాహనాల మధ్య దూరం పాటించాలని కోరారు. హజార్డ్ లైట్స్ ఆన్ చేయడంతో పాటు, డి ఫాగర్ ఆన్‌లో ఉంచాలన్నారు. ఈ నియమాలను పాటిస్తూ వాహనదారులు సురక్షితంగా తమ గమ్యాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

News January 18, 2026

Friendflationతో ఒంటరవుతున్న యువత!

image

ఇన్‌ఫ్లేషన్ ఇప్పుడు ఫ్రెండ్‌ఫ్లేషన్‌గా మారి యువతను ఒంటరి చేస్తోంది. పెరిగిన హోటల్ బిల్లులు, సినిమా టికెట్లు, పెట్రోల్ ఖర్చుల భయంతో మెట్రో నగరాల్లోని యువత బయటకు వెళ్లడం తగ్గించేస్తున్నారు. ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఖర్చు భరించలేక చాలామంది ఇన్విటేషన్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. పార్కులు, ఇంటి దగ్గర చిన్నపాటి మీటింగ్స్ వంటి లో-కాస్ట్ ప్లాన్స్‌తో స్నేహాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 18, 2026

జోరందుకున్న మద్యం అమ్మకాలు

image

AP: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ప్రతి రోజూ రూ.85 కోట్ల లిక్కర్ సేల్ జరిగినట్లు లెక్కలు వెల్లడించాయి. ఈ వారం వ్యవధిలో రూ.877 కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు చెప్పాయి. పండుగ 3 రోజుల్లో రూ.438 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు తెలిపాయి.