News August 12, 2024

చంద్రబాబును కలిసిన తెలంగాణ స్పీకర్

image

TG: ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. అలాగే విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా ఆయన చర్చించినట్లు సమాచారం. వీటిపై బాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Similar News

News September 10, 2024

లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా? జాగ్రత్తలివే!

image

* ఆ యాప్ RBIలో రిజిస్టర్ అయిందా లేదా చెక్ చేయాలి. అవ్వకపోతే రుణం తీసుకోవద్దు.
* ప్లే స్టోర్‌లో ఎక్కువ డౌన్‌లోడ్స్ ఉన్నాయని లోన్ తీసుకోవద్దు. ఎందుకంటే లక్షకుపైగా డౌన్ లోడ్స్ ఉన్న చాలా ఇల్లీగల్ యాప్స్‌ను గూగుల్ ఇప్పటికే తొలగించింది.
* కస్టమర్ కేర్ సపోర్ట్ ఉందా? ఆయా నంబర్లు పనిచేస్తున్నాయా? స్పందన ఎలా ఉందనేది నిర్ధారించుకోవాలి.
* డబ్బు తిరిగి చెల్లించినా కూడా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

News September 10, 2024

తిన్న వెంటనే ఈ పనులు చేస్తే ముప్పు తప్పదు!

image

భోజనం చేశాక కొన్ని పనులు చేయొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిన్న తర్వాత:
స్నానం చేయొద్దు. శరీరంలో ఉష్ణోగ్రత మార్పు అరుగుదలపై ప్రభావం చూపిస్తుంది. ఎక్కువ నీరు తాగొద్దు. దీని వలన ఒంట్లో టాక్సిన్లు పెరుగుతాయి. కాఫీ, టీ తాగొద్దు. వీటిలోని కొన్ని ఆమ్లాలు, ఆహారంలోని బలాన్ని తీసుకోనివ్వకుండా అడ్డుపడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోవద్దు. డయాబెటిస్, ఊబకాయం, అజీర్తి వంటి సమస్యలు రావొచ్చు.

News September 10, 2024

కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు: సీఎం రేవంత్

image

TG: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర మరవలేనిదని కొనియాడారు. ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. భూముల ఆక్రమణలు అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె స్ఫూర్తి అని చెప్పారు. ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.