News April 16, 2025
పోలీసుల పనితీరులో దేశంలోనే తెలంగాణ టాప్

పోలీసు విభాగం పనితీరుకు సంబంధించి ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం తెలంగాణ 6.48 పాయింట్లతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఈ కేటగిరిలో 6.44Pతో ఏపీ రెండో స్థానం, 6.19Pతో కర్ణాటక మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇదే విభాగంలో ప.బెంగాల్ చిట్టచివర నిలిచింది. జ్యుడీషియల్ ర్యాంకింగ్లో TGకి 2వ, APకి 5వ స్థానాలు దక్కాయి. అలాగే, ప్రిజన్స్ విభాగంలో ఏపీ 4వ, టీజీ 7వ స్థానంలో నిలిచాయి.
Similar News
News April 16, 2025
‘సురానా’ కంపెనీలపై ఈడీ దాడులు

TG: హైదరాబాద్లోని సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సాయి సూర్య తేజ డెవలపర్స్ కంపెనీపై ఈడీ దాడులు చేసింది. సురానా కంపెనీ ఛైర్మన్, డైరెక్టర్ ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, బోయిన్పల్లిలో ఈ దాడులు చేపట్టింది. కాగా వీరిపై మనీలాండరింగ్తోపాటు విదేశాలకు హవాలా రూపంలో డబ్బులు తరలించినట్లు ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. దీనిపై గతంలోనే కేసు నమోదైంది.
News April 16, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

రెండు రోజుల గ్యాప్ తర్వాత బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 పెరిగి రూ.88,150కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 990 పెరిగి రూ.96,170 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ. 200 పెరిగి రూ.1,10,000గా ఉంది.
News April 16, 2025
అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్

USలో చట్టవిరుద్ధంగా ఉంటూ సెల్ఫ్ డిపోర్టేషన్ (స్వీయ బహిష్కరణ) చేసుకునే వారికి ట్రంప్ ఆఫర్ ప్రకటించారు. సాధారణ పౌరులు తమ సొంత దేశానికి వెళ్లేందుకు విమాన ఖర్చులతో పాటు కొంత నగదు ఇస్తామని తెలిపారు. అలా వెళ్లిన వారిలో మంచివారుంటే చట్ట పద్ధతిలో వెనక్కి తిరిగిరావడానికి అనుమతిస్తామన్నారు. US నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపడమే ప్రథమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.