News September 22, 2024
పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ నారీమణులు

తెలంగాణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. మొత్తం 1.88 కోట్లకు పైగా మహిళలుంటే ప్రతి 1000 మందిలో 3.1 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. MSME పాలసీలో తీసుకున్న వివిధ చర్యలతో Udyam పోర్టల్‌లో 58,644 మంది మహిళా పారిశ్రామికవేత్తలు నమోదు చేసుకున్నారు. మహిళల నేతృత్వంలోని MSMEల వాటా విషయానికి వస్తే టాప్-3లో తెలంగాణ నిలిచింది.
Similar News
News December 8, 2025
వ్యక్తిత్వ హక్కులు కాపాడాలంటూ హైకోర్టుకు జూ.ఎన్టీఆర్

ఈ-కామర్స్, SMలో తన పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడాలని కోరుతూ జూ.ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం 2021 ఐటీ నిబంధనల ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని సదరు SM ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. డిసెంబర్ 22న సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామంటూ అదే రోజుకు తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా SMలో ట్రోలింగ్‌పై గతంలో నాగార్జున కూడా ఢిల్లీ HCని ఆశ్రయించారు.
News December 8, 2025
పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు

<
News December 8, 2025
శ్రీవారి సంపదకు రక్షకులు ఎవరో తెలుసా?

శ్రీవారి ఆలయంలోని నిధులు, సంపదలను రక్షించడానికి ప్రత్యేకంగా ఇద్దరు దేవతలు ఉన్నారు. వారే శంఖనిధి, పద్మనిధి. వీరి విగ్రహాలు ఆలయ మహద్వారానికి ఇరువైపులా దర్శనమిస్తాయి. మనం క్యూలో లోపలికి వెళ్లేటప్పుడు ద్వారపాలకుల్లా కనిపించేది వీరే. ఈ విగ్రహాలు దాదాపు రెండడుగుల ఎత్తు కలిగి ఉంటాయి. వీటిని పంచ లోహాలతో తయారు చేశారు. ఈ దేవతలు శ్రీవారి ధనాన్ని కాపాడే ముఖ్యమైన రక్షకులుగా భక్తులు భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>


