News December 18, 2024
100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు

హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్‌లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2583 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తంలో సివిల్ పనుల కోసం రూ.1980 కోట్లు, ఇతర పనుల కోసం రూ.603 కోట్లు ఖర్చు చేయనుంది. హైకోర్టు భవన నిర్మాణానికి ఈ నెలాఖరున లేదా వచ్చే నెల తొలి వారంలో ఆర్‌అండ్‌బీ టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.
Similar News
News March 26, 2026
సమ్మర్‌లో చిరాకుగా ఉందా? ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి!

పొడవైన జుట్టున్న మహిళలు వేసవిలో బయటికి వెళ్లాలంటే ఉక్కపోతతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా తల, మెడ భాగాల్లో చెమట చేరి ఇరిటేట్ ఫీల్ అవుతారు. ‘జుట్టు కత్తిరించుకుంటే బాగుండు’ అనేంతలా చిరాకు పడుతుంటారు. అలాంటివారు సమ్మర్‌లో జుట్టును ఎలా మేనేజ్ చేసుకోవాలో హెయిర్ స్టైలిస్ట్స్ చెబుతున్నారు. బీచ్ వేవ్స్ టైప్, స్క్రంచీ స్టైల్, వన్ సైడ్ బ్రైడ్ రకాలు ట్రై చేయాలని సూచిస్తున్నారు. ఆ జడల ఫొటోలు పైన చూడొచ్చు.
News March 26, 2026
CBN కాలయాపన వల్లే ఆరోగ్యశ్రీ బంద్: YCP

AP: ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయనున్నట్లు ఆశ(స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్) ప్రకటించిందని YCP ట్వీట్ చేసింది. ‘₹3 వేల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు కాలయాపన చేశారు. ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని ఆశ ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తామని స్పష్టంచేసింది. పేదల ఆరోగ్యంతో ఆటలా చంద్రబాబూ’ అని ప్రశ్నించింది.
News March 26, 2026
గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు

AP: గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని స్కూళ్లు, కాలేజీల్లో 2026-27లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 7 వరకు పొడిగించినట్లు సెక్రటరీ కృష్ణమోహన్ తెలిపారు. 5వ క్లాస్‌తోపాటు 6, 7, 8 తరగతుల్లో మిగిలిన ఖాళీలు (APRS CAT-2026), ఇంటర్, డిగ్రీ మొదటి ఏడాది (APRJC & DC CET-2026) ప్రవేశాలకు ఈ గడువు వర్తిస్తుందన్నారు. అర్హత గల అభ్యర్థులు <


