News July 19, 2024

అధికారులతో అర్ధరాత్రి సీఎం టెలీ కాన్ఫరెన్స్

image

AP: <<13656916>>పెద్దవాగు<<>> కట్ట తెగడంతో ఏలూరు జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు అర్ధరాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితిని పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో వరద ఉద్ధృతికి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా రాకపోకలు నిలిచిపోయాయి.

Similar News

News January 23, 2026

మరణం లేని యోధుడు నేతాజీ!

image

మాటలతో కాకుండా పోరాటంతోనే స్వతంత్రం వస్తుందని నమ్మిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ‘నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను’ అంటూ దేశాన్ని కదిలించారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’తో బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్‌లో ఏర్పాటుచేశారు. 1945 ఆగస్టు 18న బోస్ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. కానీ ఆయన మరణం మిస్టరీగా మిగిలిపోయింది. ఇవాళ నేతాజీ జయంతి.

News January 23, 2026

నారా లోకేశ్‌కు Jr.NTR బర్త్‌డే విషెస్

image

AP: మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది లోకేశ్‌కు అద్భుతంగా సాగాలని హీరో Jr.NTR ఆకాంక్షించారు. ఆయనకు మరింత శక్తి, సుఖసంతోషాలు కలగాలని Dy.CM పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న నేత అంటూ హోంమంత్రి అనిత, మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురు ప్రముఖులు లోకేశ్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.

News January 23, 2026

147పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ &రీసెర్చ్<>(SAMEER<<>>)లో 147 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే (JAN 25) ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, MSc, BSc, డిప్లొమా, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://sameer.gov.in/