News July 19, 2024
అధికారులతో అర్ధరాత్రి సీఎం టెలీ కాన్ఫరెన్స్

AP: <<13656916>>పెద్దవాగు<<>> కట్ట తెగడంతో ఏలూరు జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు అర్ధరాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితిని పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో వరద ఉద్ధృతికి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా రాకపోకలు నిలిచిపోయాయి.
Similar News
News February 15, 2025
ఆమెకు 74 ఏళ్లు.. అయితేనేం!

పిల్లలు, మనవళ్లతో సాధారణ జీవితం గడుపుతున్న ఓ ముసలవ్వను సోషల్ మీడియా స్టార్‌ని చేసేసింది. మహారాష్ట్రలోని అహల్యానగర్‌కు చెందిన 74 ఏళ్ల సుమన్ ధామనే తన మనవడి సాయంతో యూట్యూబ్ స్టార్‌గా మారిపోయారు. అక్కడి సంప్రదాయ వంటకాలు, పావ్ బాజీ వంటి రెసిపీలు కుకింగ్ చేసిన వీడియోలను YTలో అప్లోడ్ చేయడంతో ఆమె లక్షల మంది ప్రేమను పొందారు. ప్రస్తుతం ‘Aapli Aaji’ ఛానల్‌కు 17 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.
News February 15, 2025
రామ్ చరణ్‌తో మూవీ చేయట్లేదు: బాలీవుడ్ డైరెక్టర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా తీయబోతున్నారనే ప్రచారాన్ని బాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ ‘కిల్’ డైరెక్టర్ నిఖిల్ నగేశ్ ఖండించారు. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తాను కొత్త స్టోరీతో త్వరలోనే సినిమా చేస్తానని తెలిపారు. వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ఇందులో కథ చెప్పే విధానంలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తానని పేర్కొన్నారు.
News February 15, 2025
WPL: ఆర్సీబీకి కీలక ప్లేయర్ దూరం

గత సీజన్లో పర్పుల్ క్యాప్ విన్నర్‌గా నిలిచిన ఆర్సీబీ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యారు. ఈ విషయాన్ని ఆర్సీబీ Xలో వెల్లడించింది. ఆమె స్థానంలో స్నేహ్ రాణాను తీసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా నిన్న జరిగిన మ్యాచులో ఆర్సీబీ రికార్డు విజయం సాధించిన సంగతి తెలిసిందే.