News September 5, 2024

దీనస్థితిలో తెలుగు నటుడు.. ఆదుకున్న నిర్మాత

image

రెండు కిడ్నీలు చెడిపోయి నడవలేని దయనీయ స్థితిలో ఉన్న టాలీవుడ్ నటుడు <<14016546>>ఫిష్ వెంకట్‌ను<<>> నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆదుకున్నారు. ఆయన దీన స్థితిని తెలుసుకుని రూ.లక్ష సాయాన్ని అందించారు. ఇతర సినీ ప్రముఖులు కూడా ఫిష్ వెంకట్‌ను ఆదుకోవాలని కోరారు. అటు తనకు సాయం చేసిన నిర్మాతకు వెంకట్ ధన్యవాదాలు చెప్పారు. ఆయన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.

Similar News

News September 14, 2024

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల

image

AP: యాంకర్ శ్యామలకు వైసీపీ చీఫ్ జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఆమెను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. శ్యామలతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజాను అధికార ప్రతినిధులుగా ప్రకటిస్తూ వైసీపీ ఉత్తర్వులు జారీ చేసింది. అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(PAC) మెంబర్‌గా నియమించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ బాధ్యతలూ ఆయనకే అప్పగించారు.

News September 14, 2024

విధ్వంసం.. 45 బంతుల్లో 139 పరుగులు

image

కేరళ క్రికెట్ లీగ్‌లో త్రిస్సూర్ టైటాన్స్ ఆటగాడు విష్ణు వినోద్ విధ్వంసం సృష్టించారు. అలెప్పీ రిపిల్స్‌తో మ్యాచ్‌లో 45 బంతుల్లోనే 139 పరుగులు చేశారు. ఇందులో 17 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. తొలుత అలెప్పీ 20 ఓవర్లలో 181/6 స్కోర్ చేయగా, వినోద్ వీర విహారంతో త్రిస్సూర్ 12.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. IPLలో అతడిని MI రూ.20లక్షలకు కొనుగోలు చేసింది. 2021లో ఢిల్లీ, 2022లో SRH టీమ్స్‌లో ఉన్నారు.

News September 14, 2024

UPSC సివిల్ సర్వీసెస్ అడ్మిట్ కార్డులు విడుదల

image

UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. <>https://upsconline.nic.in/<<>> వెబ్‌సైట్‌లో ఈ నెల 29 వరకు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి 29 వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఆల్ ఇండియా సర్వీసుల్లో 1,056 పోస్టుల భర్తీకి జూన్ 16న ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగగా, జులై 1న ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే.