News December 31, 2024
రూ.8వేల కోట్ల కలెక్షన్లు సాధించిన ‘తెలుగు సినిమా’

భారత చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా మరోసారి సత్తాచాటింది. 2024లో ఇండియన్ బాక్సాఫీసులో రూ.8వేల కోట్ల బిజినెస్ చేసి ఔరా అనిపించింది. హిందీ సినిమా రూ.10వేల కోట్లతో తొలిస్థానంలో ఉండగా రూ.7వేల కోట్లతో తమిళ సినిమా మూడో ప్లేస్‌లో నిలిచింది. మలయాళం రూ.6వేల కోట్లు, కన్నడ రూ.5వేల కోట్లు సాధించాయి. ఆ తర్వాత పంజాబీ(రూ.300కోట్లు), మరాఠీ(రూ.185 కోట్లు), గుజరాతీ(రూ.70 కోట్లు), బెంగాలీ(రూ.55 కోట్లు) ఉన్నాయి.
Similar News
News October 31, 2025
NABFINSలో ఉద్యోగాలు

నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీస్ (NABFINS) వివిధ రీజియన్లలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పని అనుభవం ఉన్నవారు, ఫ్రెషర్స్ కూడా దరఖాస్తుకు అర్హులే. టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33ఏళ్లు. వెబ్‌సైట్: https://nabfins.org/
News October 31, 2025
రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాలు

TGలోని SECBAD, కాచిగూడ, APలోని విజయవాడ, TPT, రాజమండ్రి, GNTతో పాటు దేశంలో 76 స్టేషన్లలో ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మహా కుంభమేళా వేళ ఢిల్లీ స్టేషన్‌లో తొక్కిసలాట అనంతరం రద్దీని నియంత్రించేందుకు అక్కడ ‘యాత్రి సువిధ కేంద్ర’ను అభివృద్ధి చేశారు. ఇందులో టికెట్ కౌంటర్‌తో పాటు ప్రయాణికులు వేచి ఉండేలా వసతులు కల్పించారు. ఇదే మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తారు.
News October 31, 2025
‘బాహుబలి ది ఎపిక్’ మూవీ రివ్యూ

‘బాహుబలి ది ఎపిక్’లో 1, 2 పార్టులను కలిపి ఎడిట్ చేసినా స్క్రీన్ ప్లే మారలేదు. బాహుబలి తిరిగి మాహిష్మతికి వచ్చే సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. సాంగ్స్, యుద్ధం సీన్లను ట్రిమ్ చేశారు. 90 నిమిషాల సీన్లు కట్ అయినా మూవీపై ప్రభావం పడలేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయి. కీలక సన్నివేశాలతో కథను నడిపేందుకు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చారు. తమన్నా లవ్ ట్రాక్, సుబ్బరాజు కామెడీ సీన్స్ లేకపోవడం కాస్త మైనస్.


