News February 17, 2025

ఇప్పుడేదో తెగ ఆఫర్లిస్తున్నట్లు.. ఎస్కేఎన్‌పై తెలుగు హీరోయిన్ ఫైర్

image

తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయబోమన్న నిర్మాత <<15485932>>ఎస్కేఎన్‌పై<<>> హీరోయిన్ రేఖా భోజ్ ఫైర్ అయ్యారు. ‘ఇప్పుడేదో తెగ ఆఫర్లిస్తున్నట్లు.. ప్రతివాడు పెద్ద ఉద్దరించేసినట్లు ఎదవ బిల్డప్పులు. ఒక రకంగా ఇది తెలుగు అమ్మాయిలపై అఫీషియల్‌గా బ్యాన్ విధించినట్టే.. మా బతుకుదెరువుపై కొట్టేలా మాట్లాడాక మీకు గౌరవం ఇచ్చేదేంటి?’ అని మండిపడ్డారు. రేఖా భోజ్ మాంగళ్యం, దామిని విల్లా, రంగీలా వంటి చిత్రాల్లో నటించారు.

Similar News

News April 19, 2026

ఓపెనర్ల పరుగుల వరద.. తీవ్ర పోటీ

image

టీమ్‌ఇండియా ఓపెనింగ్ స్లాట్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. IPLలో భారత ఓపెనర్లు పరుగుల వరద పారిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, సంజూ శాంసన్, అభిషేక్, ఇషాన్ కిషన్, గిల్, KL రాహుల్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు గిల్ 251 (4 మ్యాచులు), వైభవ్ 246 (6), జైస్వాల్ 223 (6), ఇషాన్ 213 (6), ప్రియాన్ష్ 211 (5), ప్రభ్‌సిమ్రన్ సింగ్ 211 (6), అభిషేక్ 188 (6) రన్స్ చేశారు.

అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి

image

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. లూసియానాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 1-14 ఏళ్ల వయసు ఉన్న 8 మంది పిల్లలు మరణించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం 6AMకు కాల్పులు జరిగాయి. మరో ఇద్దరికి గాయాలయ్యాయని ష్రీవ్‌పాన్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.