News August 29, 2024

తెలుగు భాష ఎంతో గొప్పది: మోదీ

image

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఇది నిజంగా చాలా గొప్ప భాష. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది. తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను’ అని ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.

Similar News

News September 17, 2024

బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు స్టే

image

దేశవ్యాప్తంగా ప్రైవేట్ కట్టడాలపై అనధికారిక బుల్డోజర్ యాక్ష‌న్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అక్టోబర్ 1 వరకు ఎలాంటి కూల్చివేతలు చేయొద్దని ఆదేశించింది. ప్రభుత్వ ఆస్తులైన రైల్వే లైన్లు, రోడ్లు, ఫుట్ పాత్‌లు, నీటి వనరులను ఆక్రమిస్తే కూల్చివేయొచ్చని తెలిపింది. ఎన్నికల కమిషన్‌కు కూడా ఇదే ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండొద్దని పేర్కొంది.

News September 17, 2024

ఢిల్లీ ప్రభుత్వ విద్యాశాఖకు ఆమె బ్యాక్‌ బోన్

image

ఢిల్లీలో ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్య ప‌ట్ల‌ త‌ల్లిదండ్రుల్లో న‌మ్మ‌కం కుద‌ర‌డం వెనుక CM ఎలెక్ట్ ఆతిశీది కీలకపాత్ర. గతంలో విద్యాశాఖ మంత్రికి సలహాదారుగా, ప్రస్తుతం ఆ శాఖ మంత్రిగా ఉన్న ఆమె పాఠ‌శాల‌ల్లో మెరుగైన వ‌స‌తులు, విద్యార్థుల స‌మ్మిళిత వికాసానికి డిజిట‌ల్ త‌ర‌గ‌తులు, క్రీడ‌లు, ఆంత్రప్రెన్యూరియల్ క‌రిక్యుల‌మ్ ప్ర‌వేశ‌పెట్టారు. ఈ ప్ర‌య‌త్నాలు స‌త్ఫ‌లితాలు ఇస్తుండ‌డం వెనుక ఆతిశీ కృషి ఎంతో ఉంది.

News September 17, 2024

గణేశ్ నిమజ్జనం.. తెలంగాణ పోలీసుల సూచన

image

రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. ‘గణేశ్ నిమజ్జనంలో ప్రజలు శాంతియుతంగా ఆనందోత్సాహాలతో పాల్గొనాలి. ఎక్కడా గొడవలకు తావివ్వకూడదు. ఇతరులకు ఇబ్బంది కలిగించకండి. ఎవరైనా మీకు అమర్యాదగా, అసభ్యకరంగా ప్రవర్తించినట్టు కనిపిస్తే వెంటనే డయల్ 100కి లేదా దగ్గర్లోని పోలీసులకు సమాచారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.