News August 4, 2024

కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

image

కేదార్‌నాథ్‌లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 15మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, వారిని తరలించాలని రుద్రప్రయాగ్ కలెక్టర్‌కు సూచించారు. దీంతో అధికారులు హెలికాప్టర్‌ ద్వారా 12మందిని ఉత్తర కాశీకి తరలించారు. మరో ముగ్గురు ఇంకా కేదార్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 2, 2025

ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని CSIR-<>IICT<<>> 10 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, టెక్నీషియన్(జనరల్ నర్సింగ్/ANM), ఫార్మసీ టెక్నీషియన్, టెక్నీషియన్( క్యాటరింగ్&హాస్పిటాలిటీ) పోస్టులు ఉన్నాయి. నెలకు జీతం రూ.39,545 చెల్లిస్తారు. ట్రేడ్ టెస్ట్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iict.res.in

News December 2, 2025

దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

image

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.

News December 2, 2025

ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

image

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్‌తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.