News August 4, 2024
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు
కేదార్‌నాథ్‌లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 15మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, వారిని తరలించాలని రుద్రప్రయాగ్ కలెక్టర్‌కు సూచించారు. దీంతో అధికారులు హెలికాప్టర్ ద్వారా 12మందిని ఉత్తర కాశీకి తరలించారు. మరో ముగ్గురు ఇంకా కేదార్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 17, 2024
ఆండ్రాయిడ్ డేటాని iOSలోకి ఇలా మార్చుకోండి
ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Move to iOS యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే మీ ఐఫోన్‌లో యాప్స్ అండ్ డేటాలో Move Data from Android సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు వచ్చే కోడ్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎంటర్ చేయాలి. తద్వారా ఐఫోన్ టెంపరరీ వైఫై నెట్‌వర్క్‌ను క్రియేట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఈ నెట్‌వర్క్‌లో జాయిన్ అవ్వాలి. అనంతరం డేటా టైప్ సెలక్ట్ చేసుకొని ఐఫోన్‌లోకి బదిలీ చేసుకోవచ్చు.
News September 17, 2024
గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం కమిటీ
TG: గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన రాష్ట్ర కార్మికుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2023 డిసెంబర్ 7 తర్వాత గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ‘ప్రవాసీ ప్రజావాణి’ పేరుతో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది.
News September 17, 2024
కొనసాగుతున్న సీఎంల రాజీనామా ఒరవడి
ప్రభుత్వంలో కుమ్ములాటలు, MLAల ఫిరాయింపులు, కోర్టు కేసుల వల్ల ఇటీవల పదవిలో ఉన్న CMలు రాజీనామాలు చేస్తున్న ఒరవడి కొనసాగుతోంది. గతంలో MHలో ఉద్ధవ్ ఠాక్రే, MPలో కమలనాథ్, ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్, హరియాణలో మనోహర్ లాల్, KAలో యడియూరప్ప, గుజరాత్‌లో విజయ్ రూపాని, ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్ పదవిలో ఉండగా రాజీనామా చేశారు. తాజాగా ఢిల్లీ CM కేజ్రీవాల్ ఈ జాబితాలో చేరనున్నారు.