News January 29, 2025
తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. TGలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనుండగా ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతాయి. ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 11న నామినేషన్ల పరిశీలన, 13 తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు పూర్తి కానున్నాయి.
Similar News
News February 8, 2025
శుభ ముహూర్తం(08-02-2025)

✒ తిథి: శుక్ల ఏకాదశి రా.9.30 వరకు
✒ నక్షత్రం: మృగశిర రా.7.32 వరకు
✒ శుభ సమయాలు: ఉ.11.35 నుంచి మ.12.11 వరకు, సా.4.35 నుంచి 5.23 వరకు
✒ రాహుకాలం: ఉ.9.30 నుంచి మ.10.30 వరకు
✒ యమగండం: మ.1.30 నుంచి 3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి ఉ.7.36 వరకు
✒ వర్జ్యం: తె.జా.3.42 నుంచి 5.15 వరకు
✒ అమృత ఘడియలు: మ.1.07 నుంచి 2.38 వరకు
News February 8, 2025
TODAY HEADLINES

* రాష్ట్రంలో BCల జనాభా పెరిగింది: రేవంత్
* విజన్-2047కు సహకరించండి: నీతిఆయోగ్‌తో చంద్రబాబు
* ఒంగోలులో ముగిసిన RGV విచారణ
* విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్
* కుంభమేళాలో సన్యాసినిగా మారిన మరో నటి
* ఒక్క వ్యక్తికే రతన్ టాటా ఆస్తిలో ₹500కోట్లు!
* జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
* వడ్డీరేట్లు తగ్గించిన RBI
* తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక ఆదేశాలు
News February 8, 2025
7 గంటల పాటు ప్రభావతిని ప్రశ్నించిన SP

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ ముగిసింది. ఆమెను ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో 7 గంటల పాటు ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభావతి A5గా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న ఆమె తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపణలున్నాయి.