News February 2, 2025

తెలుగోళ్లు.. టాలెంట్ చూపిస్తున్నారు

image

భారత జట్టు అనగానే అప్పట్లో ఒకరిద్దరి తెలుగు ప్లేయర్ల పేర్లే వినిపించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సిరాజ్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, గొంగడి త్రిష సత్తా చాటుతున్నారు. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ మరింత మంది ప్లేయర్లు జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Similar News

News February 15, 2025

22 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న 48ఏళ్ల నటుడు

image

బాలీవుడ్ నటుడు, యూట్యూబర్ సాహిల్ ఖాన్ 48 ఏళ్ల వయసులో వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రియురాలైన 22 ఏళ్ల మిలేనా అలెగ్జాండ్రాను వివాహమాడారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో వీరిద్దరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సాహిల్ గతంలో నార్వేజియన్ నటి నెగర్ ఖాన్‌ను వివాహం చేసుకోగా రెండేళ్లకే విడిపోయారు.

News February 15, 2025

టీడీపీ నేతలను వేధించినవారిపై రెడ్‌బుక్ అమలు: లోకేశ్

image

AP: వైసీపీ హయాంలో జరిగిన అరాచకపాలన ప్రజలందరికీ తెలుసని మంత్రి లోకేశ్ చెప్పారు. చట్టాలను ఉల్లంఘించి టీడీపీ నేతలను ఇబ్బందిపెట్టిన వారిపై రెడ్ బుక్ అమలవుతుందని స్పష్టం చేశారు. తప్పుచేసిన వైసీపీ నేతలు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని యువగళంలోనే చెప్పానన్నారు. ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వల్లభనేని వంశీ జైలుకెళ్లారని, ఈ కేసులో వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.

News February 15, 2025

సోమనాథ్ క్షేత్రం ప్రత్యేకతలు మీకు తెలుసా… !

image

ద్వాదశ జ్యోతిర్లింగాలలో గుజరాత్‌లో ఉండే సోమనాథ్ క్షేత్రం మెుదటిది. చంద్రునికి శాపవిముక్తి కలిగించిన ప్రదేశం కాబట్టి దీనికి సోమనాథ క్షేత్రంగా పేరొచ్చిందని ప్రతీతి. చంద్రుడు ఈక్షేత్రాన్ని బంగారంతో నిర్మించగా, రావణాసురుడు వెండితో, శ్రీ కృష్ణుడు చందనపు చెక్కలతో నిర్మించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. గజనీ మహమ్మద్ సహా అనేక మంది దాడి చేసి సంపద దోచుకెళ్లగా 1951లో పునర్నిర్మించి ప్రారంభించారు.

error: Content is protected !!