News November 15, 2024
తెలుగు టైటాన్స్ ఓటమి
ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11లో భాగంగా UP యోధాస్‌తో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఓడింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 20-16తో ఆధిక్యం కనబర్చింది. అయితే ఆ తర్వాత UP ఆటగాళ్లు పుంజుకున్నారు. చివరికి UP 40 పాయింట్లు సాధించగా టైటాన్స్ 34 పాయింట్లకే పరిమితమైంది. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్(32)పై U ముంబా(35) గెలిచింది. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో హరియాణా ఉండగా టైటాన్స్ 6వ స్థానంలో ఉంది.
Similar News
News December 4, 2024
1983లోనే వాచ్‌లో టీవీ చూసే సదుపాయం!
అనలాగ్ వాచ్ నుంచి డిజిటల్ వాచ్‌లు రావడంతో మొబైల్ లేకుండానే కాల్స్, మెసేజ్‌లు చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చేసింది. అయితే, దీనికంటే ముందే 1983లో వచ్చిన SEIKO టీవీ వాచ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనిలో ఎక్కడి నుంచైనా వాచ్ నుంచి టీవీని వీక్షించే సదుపాయం ఉండేది. ఇది అత్యంత చిన్న టీవీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకుంది. ఈ వాచ్‌ను 400 డాలర్లకు( 1983లో) విక్రయించేవారు.
News December 4, 2024
ఫ్యాన్స్‌తో ‘పుష్ప-2’ వీక్షించనున్న అల్లు అర్జున్!
‘పుష్ప-2’ సినిమాను తన అభిమానులతో చూసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు చేరుకుంటారని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈరోజు రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. దీనిపై సాయంత్రంలోపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, దీనికోసం నిర్వాహకులు సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
News December 4, 2024
చుట్టూ సొరచేపలు.. అత్యంత ప్రమాదకరమైన హోటల్!
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన హోటల్ గురించి మీరెప్పుడైనా విన్నారా? ఈ ఫ్రైయింగ్ పాన్ హోటల్ నార్త్ కరోలినా తీరానికి 32 మైళ్ల దూరంలో ఉంది. చుట్టూ ఉండే నీటిలో సొరచేపలుంటాయి. సముద్ర మట్టానికి 135 అడుగుల ఎత్తులో నాలుగు స్థంబాల సపోర్ట్‌తో దీనిని నిర్మించారు. ఇక్కడి చేరుకునేందుకు హెలికాప్టర్ లేదా బోట్ అందుబాటులో ఉంటాయి. ఇది ఒక లైట్‌హౌస్ ప్లాట్‌ఫామ్ కాగా, పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.