News May 20, 2024

కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ

image

కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయా బాదిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జి బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఏపీలోని విజయవాడకు చెందిన జయ హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం US వెళ్లిన జయ, బోస్టన్ యూనివర్సిటీలో ఎంఏ, శాంటా క్లారా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. 2009లో కాలిఫోర్నియా బార్ ఎగ్జామ్ క్లియర్ చేశారు.

Similar News

News December 5, 2024

పెళ్లి తర్వాత శోభిత తొలి పోస్ట్

image

అక్కినేని హీరో నాగచైతన్యతో వివాహం తర్వాత హీరోయిన్ శోభిత తొలి పోస్ట్ చేశారు. చైతూతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘పెళ్లి ఫొటో’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా నిన్న వీరిద్దరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

News December 5, 2024

ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ స‌ర‌ఫ‌రాపై ఆందోళ‌న‌లు

image

మెడిసిన్స్‌ను 10 Minలో వినియోగ‌దారుల‌కు డెలివ‌రీ చేస్తున్న సంస్థ‌ల తీరుపై ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మందుల స‌ర‌ఫ‌రాలో ఉన్న నిర్దిష్ట ప్రోటోకాల్‌కు ఇది విరుద్ధ‌మ‌ని చెబుతున్నారు. ప్రిస్క్రిప్ష‌న్ వెరిఫికేష‌న్, పేషెంట్ ఐడెంటిఫికేష‌న్‌ లేకుండానే మెడిసిన్స్ డెలివ‌రీ హానిక‌ర‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు. కాలంచెల్లిన, న‌కిలీ మందుల స‌ర‌ఫ‌రాకు ఆస్కారం ఉండడంతో దీన్ని అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారు.

News December 5, 2024

మీకు నేషనల్ అవార్డు ఇవ్వాలి.. రష్మిక రియాక్షన్ ఇదే

image

‘పుష్ప-2’లో హీరోయిన్ రష్మిక అదరగొట్టారని సినిమా చూసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా జాతర సీన్‌ తర్వాత ఆమె నటనకు జాతీయ అవార్డు ఇవ్వాలని ఓ అభిమాని ట్వీట్ చేశారు. దీనికి ‘నిజమా? యాయ్!’ అంటూ నేషనల్ క్రష్ రిప్లై ఇచ్చారు. కాగా ఈ మూవీలో రష్మిక డాన్స్ కూడా ఇరగదీశారని పలువురు పోస్టులు చేస్తున్నారు.