News August 26, 2024
జోడెద్దులకు గుడి.. 15 ఏళ్లుగా పూజలు

AP: వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే ఎద్దులంటే రైతన్నలకు ఎంతో ప్రేమ. వాటిని కుటుంబసభ్యుల్లాగే భావిస్తారు. అవి చనిపోతే తల్లడిల్లిపోతారు. అన్నమయ్య(D) నరసాపురానికి చెందిన పెద్దప్పయ్యకు ఉన్న జోడెద్దులు 15ఏళ్ల కిందట చనిపోయాయి. వాటికి అంత్యక్రియలు చేసి, అక్కడే గుడి కట్టి విగ్రహాలను ఏర్పాటుచేశారు. రోజూ పూజలతోపాటు ఏటా అన్నదానమూ చేసేవారు. ఆయన చనిపోయినా కుటుంబీకులు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
Similar News
News March 5, 2026
ఇజ్రాయెల్ ఎంబసీలన్నీ ధ్వంసం చేస్తాం.. ఇరాన్ వార్నింగ్

లెబనాన్‌లోని తమ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ దేశ ఎంబసీలు అన్నింటిపై దాడులకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రతినిధి షెకార్చి ప్రకటించారు. అంతకుముందు లెబనాన్‌లోని ఇరాన్ ఎంబసీలో ఉంటున్న ప్రతినిధులు ఖాళీ చేయాలని.. ఇందుకు 24 గంటల గడుపు ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు చేస్తోంది.
News March 5, 2026
ఈరోజు నమాజ్ వేళలు (05-3-2026) గురువారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.20 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: మధ్యాహ్నం 3.50 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.24 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.37 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 5, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


